Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెడం ఎలా?

వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెడం ఎలా?

వర్షాకాలంలో వచ్చే వ్యాధులు సాధారణంగా నాలుగు ప్రాథమిక మాధ్యమాల ద్వారా వస్తాయి. ఒకటి దోమల ద్వారా, రెండు నీటి ద్వారా, మూడు గాలి ద్వారా, అలాగే కలుషితమైన ఆహారం ద్వారా. అయితే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు సంభవిస్తాయి.వీటికి నివారణ మార్గాలు ఇప్పుడు చూద్దాం. ఇల్లు మరియు చుట్టుపక్కల ఎక్కడా నీరు నిలవ ఉండకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో ఎక్కువగా చెత్త లేకుండా చూసుకోండి. స్నానపు గదులను క్రమం తప్పకుండా కడగండి. అలాగే దోమలు ఇంట్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోండి. మీ దుస్తులు కూడా చర్మం బహిర్గతం అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. అలాగే నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు టైఫాయిడ్, కలరా, లెఫ్టోస్ఫిరోసిన్. ఇవి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఆహారాన్ని వండి వడ్డించే విధానంలో పరిశుభ్రత పాటించాలి.మీ పిల్లలకు టీకాలు వేయకపోతే వెంటనే వేయించండి. ఇలా చేయడం వలన నీటి ద్వారా వచ్చే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం. అలాగే పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవటం జరుగుతూ ఉంటుంది.ఈ జబ్బులకి చెక్ పెట్టాలంటే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి అడ్డుగా కర్చీఫ్ పెట్టుకోండి. ఆరు బయట నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చేతులు మరియు కాళ్ళని శుభ్రం చేసుకోవటం తప్పనిసరి. ఇంట్లో ఎక్కువగా వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. ఇన్ఫెక్షన్లతో బాధపడే వ్యక్తులకు మీ పిల్లలను దూరంగా ఉంచడం అత్యవసరం.అలాగే ఆహారం ద్వారా అంటే బయట ఫుడ్ తినటం వర్షాకాలంలో అసలు మంచిది కాదు. దీని వలన స్టమక్ ఇన్ఫెక్షన్, త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ ని తగ్గించండి. ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుని వేడివేడిగా భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article