ప్రస్తుతం ఎన్.టి.ఆర్. నటించిన దేవర సినిమా గురించి అంతా చర్చ జరుగుతోంది. రెండు భాగాలుగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి భాగం ఎండింగ్ లోనే రెండో భాగం చూడాలనే ఆసక్తి కలుగుతుందని ఎన్.టి.ఆర్. తెలియజేశారు. ఇటీవల ముంబై ప్రమోషన్ లో భాగంగా చిత్ర టీమ్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా వారి పారితోషికంపై పలు రకరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వారంతా ఒకే సమాధానం చెప్పడం అదే కష్టానికి తగ్గ పారితోషికం తీసుకున్నామ్ అని చెప్పడం .అయితే ఎన్.టి.ఆర్. ఇంతకుముందు రాజమౌళితో చేసిన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు 45 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. దేవరకు మాత్రం 60 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇండస్ట్రీలో నెలకొంది. అలా అని మిగిలిన నటీనటులు కూడా తక్కువేమి కాదు. జాన్వీకపూర్ 5 కోట్లు, సైఫ్ అలీఖాన్ 10 కోట్లు, ప్రకాష్ రాజ్ 1. 50 కోట్లు తీసుకున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలోని పాయింట్ గురించి ఎన్.టి.ఆర్. చెబుతూ, భయమే కథను నడుతుతుంది. ఆ భయంతోపాటు యాక్షన్ డ్రామా చాలా కీలకం. 80 దశకంలో కోస్తా తీరంలో ఇండియాలో చాలా వెనుకబడిన ప్రాంతాలున్నాయి. అక్కడ గ్రామదేవతలను పూజిస్తారు. వారు దేనికైనా తెగిస్తారు. అది ఎలాఅనేది కొరటాల శివ అద్భుతంగా చూపించారని అన్నారు.