బొడ్డేపల్లి అయితేనే ఆ నియోజకవర్గానికి సరైనోడు
తమ్మినేని కి పార్లమెంటరీ పరిశీలకుల బాధ్యతలు
శ్రీకాకుళం :ఆముదాలవలస నియోజకవర్గం పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధిష్టానం నియోజకవర్గ ఇన్చార్జిని మార్పు చేస్తే తమ్మినేని వారసుడిగా ఉన్న చిరంజీవి నాగ్ (నాని), కోడలు మాధురికి అవకాశం ఇస్తారా..?లేక తమ్మినేని మదిలో ఆప్తుడు గా ఉన్న బొడ్డేపల్లి రమేష్ కుమార్ కి అవకాశం ఇస్తారా..!? లేక జగన్ మదిలో ఇంకెవరైనా ఉన్నారా అన్నదే ఇప్పుడే అంతాప్ చర్చ అక్కడ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ స్థానిక నేతగా తమ్మినేని కి ఇష్టపడే ఆ నేత ఎవరో మరి ఎవరి మదిలో ఏమన్నా కూన రవి కుమార్ ను ఎదుర్కొనే దమ్మున్న నాయకుడు ఎవరన్నదే ఇప్పుడు ముఖ్యమని కార్యకర్తల నోట మాట బొడ్డే పల్లి రమేష్ కుమార్ కలిసి వచ్చే అంశాలు..రమేష్ కుమార్ విద్యార్థి దశ నుండే నుండే నాయకత్వ లక్షణాలు ఉండటం ఎన్ని కష్టాలు వచ్చిన ఏ పదవి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వెంట ఉండటం, ప్రతిపక్షంలో ప్రతి అంశంలోనూ అవగాహనతో అప్పట్లో పాలక పక్షాన్ని నిలదీసే గుణం ఉండటం, ఎన్ని అవకాశాలును అప్పటి పాలక పక్షం ఆశ చూపినా…నమ్మిన సిద్ధాంతాలు, పార్టీ కార్యకర్తలు కు కష్టం వస్తే నేను ఉన్న అనే గుణం బొడ్డేపల్లి రమేష్ కుమార్ నైజం.సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్, కోట బ్రదర్స్ అసమ్మతి గళం వినిపించినప్పటికీ బొడ్డేపల్లి రమేష్ కుమార్ తమ్మినేని వెంటే ఉండడం. ఆయన కలిసొచ్చే విషయం గానే చెప్పవచ్చు. దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రతి పక్షంలో ఉన్న సమయంలో బొడ్డేపల్లి రమేష్ కుమార్ 60 రోజుల పాటు జైలు జీవితం ఆమదాలవలస రైల్వే ఫుట్ వేరే బ్రిడ్జి పోరాటంలో తమ్మినేని తో పాటు ముందుండి నడిపించి రైల్వే శాఖ బెదిరింపులకి లొంగక చివరకు కేసులు బాణయించినా… కోర్టు ల్లో కేసులు ఎదుర్కొన్న దమ్మున్న నాయకుడు గా కార్యకర్తలలో మంచి పేరు. ఇటు బొడ్డేపల్లి కుటుంబంతోపాటు అటు స్వతంత్ర సమరయోధులు జననాయక్ డా. చౌదరి సత్యనారాయణ కుటుంబానికి చెందిన వ్యక్తి గా బొడ్డేపల్లి రమేష్ కుమార్ కి మంచి పేరుంది. అన్నింటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్ష ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ తో పోరాటం చేయాలంటే మిగతా వాళ్ల కంటే బొద్దేపల్లి రమేష్ కుమార్ పోరాటం చేయడంలో ముందుంటారు అన్నది కార్యకర్తల్లో బలమైన నమ్మకం గా భావిస్తున్నారు కేడర్. తమ్మినేని సీతారాం కుటుంబానికి ఇస్తే తాము అంతా వెనకే ఉంటాం లేదంటే బొడ్డేపల్లి రమేష్ కుమార్ కి ఇస్తే మరింత కష్టపడతాం అంటున్న క్రింది స్థాయి కేడర్ వైసీపీ మళ్ళీ పాగా వేసింది అంటే ఆమదాలవలస నియోజకవర్గంలో మళ్లీ వెనుతిరిగి చూడకూడదు అన్నదే కిందిస్థాయి క్యాడర్లో గట్టి పట్టుదల గా కనిపిస్తుంది* శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఎప్పుడూ..చర్చికొచ్చే నియోజకవర్గాలు . ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాలు . ప్రధానంగా ఈ నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే ఉన్న అగ్ర నేతలు .అటు పాలక పక్షంలోనూ, ప్రతిపక్షంలోనూ ఉంటూ వస్తుంటారు అందుకే ఈ నియోజకవర్గాలు ఎప్పుడూ చర్చినియాంసమే. అయితే ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గమే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న తమ్మినేని కి పార్లమెంటు పరిశీలకులుగా బాధ్యతలు అప్పజెప్పడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గ అభ్యర్థి ఎవరన్నదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆమదాలవలస నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఇన్చార్జి బాధ్యతలు తమ్మినేని కుటుంబానికి తెచ్చుకుంటారా లేదా ఆయనకి నమ్మకంగా ఉన్న వారికి అవకాశం ఇస్తారా…అన్నదే ఇప్పుడు నియోజకవర్గం అంతా కాదు కాదు.. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశగా మారింది. … ఆమదాలవలసలో తమ్మినేనికి వారసులుఆధిపత్యంతో! కేడర్లో నిర్లిప్తత, బొడ్డేపల్లి సత్యవతిమరియు ఆమె వారసులు ప్రభావితం చూపకపోవటం,కాంగ్రెస్‌ను వీడకపోవటం, అదే బొడ్డేపల్లి కుటుంబం నుంచి మునిసిపల్ అభ్యర్థిగా వైసీపీ నుండి కౌన్సిలర్గ పక్ష నాయుకులుగా వ్యవహరించిన బొడ్డేపల్లి రమేష్ కుమార్ రాజకీయ ఎదుగుదలకి మునిసిపల్ ఎన్నికలుజరగకపోవటం ఆయన రాజకీయ ఎదుగుదలకు ఒక ప్రతిభంధకమే..! బొడ్డేపల్లి రమేష్ కుమార్ కు పార్టీ పదవి కానీ, ప్రోటోకాల్ పదవి కానీ ఇవ్వక పోయినప్పటికీ ఆయన తమ్మినేని వెంటే ఉంటూ ఆయనకి నమ్మకస్తుడిగా ఉండడం రమేష్ కుమార్ నిబద్ధతకు నిదర్శనం. తమ్మినేని వెంటే ఉండడం, అసమ్మతి గళం ఇప్పటివరకు వినిపించకపోవడం ఆయనకు కలిసిచ్చే అంశం గానే చెప్పొచ్చు. ఆమదాలవలస రూరల్, ఆమదాలవలసమునిసిపాలిటీ , బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు మండలంలో ఒక ఏకభిప్రాయం వచ్చినట్టు. బొడ్డేపల్లి కుటుంబం నుండి. ఒక వ్యక్తితో వైసీపీ… రాజకీయ ప్రస్థానం కొనసాగించే ఆలోచన ఐతే చేస్తున్నట్లు . కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. బొడ్డేపల్లి కుటుంబంలో పెద్ద లు కూడా సత్యవతితో సంప్రదింపులు చేసినట్టు భోగట్ట.. మళ్ళీ రాజగోపాలరావు. వెంకటబాబు. పైడి శ్రీరామమూర్తి. చిట్టి బాబు. సత్యవతిల రాజకీయ హవాని మళ్ళీ కొనసాగించాలి. ఐకమత్యం మహా బలంగా, ఒక ” నిర్ణయం అక్కులపేటలో అంకు రార్పణ జరిగిందని. . మరికొందరు బొడ్డేపల్లి అభిమానులు సూచనలుకి అంగీకారం తెలిపినట్టు భోగట్ట. పూర్వపు రాజకీయాలలో ఇక్కడ “చిన ఏటి” ప్రాంత నాయకులు ని ఎదుర్కోవాలంటే, నా వరకు ఎంపీ గా పరవాలేదు కానీ అసెంబ్లీ పరంగా తమ్మినేనిని ఎదుర్కోవడం కష్టం అని ఆ నాడు దివంగత రాజగోపాలరావు ఆలోచించి పైడి శ్రీరామమూర్తి ని ఆమదాలవలస లో పోటీ చేయించి, విజయం సాధించి నట్లు…..ఇప్పుడు తమ్మినేని కూడా దూరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలు అందరూ సంతోషం గా ఉంటారన్నది సీనియర్స్ సైతం చర్చించికుంటున్నారు. ఆ దిశలోనే శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలుకులుగా వెళ్లిన తమ్మినేని ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ కొత్త ఇంచార్జ్ గా బొడ్డేపల్లి రమేష్ కుమార్ ని నియమించే అలోచన ఐతే జరుగుతుంది అన్నది కేడర్ లో వినిపిస్తున్న మాట. మొన్న ఎలక్షన్ వరకు సువ్వారి గాంధీ పేరు వినిపించినప్పటికీ గాంధీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవడంతో… తమ్మినేని తర్వాత అంత సత్తా ఉన్న నాయకుడు ఎవరన్నది ఇప్పుడు అందరి ఆలోచన. తమ్మినేని చిరంజీవి నాగ్ (నాని) లేదా కోడలు మాధురి కాకపోతే అందుకు తర్వాత వరుసలో ఉన్నవారు బొడ్డేపల్లి రమేష్ కుమార్, చింతాడ రవికుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ తెర వెనుక సెకండ్ క్యాడర్ స్థాయి నేతలు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. అయితే ఎవరు ఎన్ని పావులు కదిపినా స్థానికంగా ఉన్న తమ్మినేని మదిలో ఎవరున్నారు అన్నది ఇప్పుడు అంతా ఉత్కంఠ. శ్రీకాకుళం. ఆమదాలవలసల వైసీపీ ఇంచార్జ్లు మార్పు జరిగితే తమ్మినేని ఎవరిని ప్రతిపాదిస్తారు.. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణ దాస్ ఎవరు పేరును క్రాస్ చెక్ చేసి అధిష్టానానికి సూచిస్తారు అన్నదే ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గం వైయస్సార్ పార్టీ అభిమానులను, కార్యకర్తలను కలవర పెడుతుంది. ఈ చర్చికి ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారు… నియోజకవర్గం లో మంచి పోరాటపటిమ., పాలకపక్షాన్ని దీటుగా ఎదుర్కోగలగా వ్యక్తిని ఎప్పుడు ప్రకటిస్తారో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.