స్టాకహేోం : అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలు డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ. రాబిన్‌సన్‌లను వరించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనకు గాను వారికి ఈ అవార్డు ప్ర కటించినట్లు నోబెల్ బృందం సోమవారం పేర్కొంది.ఏస్‌మోగ్లు, జాన్సన్‌లు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, రాబిన్‌సన్ చికాగో యూనివర్శిటీలో విధులు నిర్వహిస్తున్నారు.
”పేలవమైన చట్టాల పాలనను, జనాభాను దోపిడీ చేసే సంస్థలు కలిగి ఉన్న సమాజాలు, అభివృద్ధిని సృష్టించవు లేదా మెరుగైన మార్పును కల్పించవు” అని తెలుసుకునేందుకు వీరి అధ్యయనం సహాయపడిందని వెల్లడించింది.