-ఏళ్లుగా పాతుకుపోయిన నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు
-వాళ్ళు చేయాలనున్నదే ఫైల్, లేకుంటే వెనక్కి తిప్పి ముప్పుతిప్పలు
ఎచ్ఎండిఏ లో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా ఉండే మెట్రోపాలిటన్ అథారిటీకి కొత్త కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిని వేశాక అందులో కొంత ప్రక్షాళన జరుగతుంది. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసి అక్రమాలకు ఆలవాలంగా మారిన కొన్ని శాఖలను ఇప్పటికే దుమ్ము దులిపారు. కానీ కొందరు నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు మాత్రం కొన్నేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఒక నాన్ క్యాడర్ ఉన్నతాధికారి తన దగ్గరకి వచ్చే ఫైల్స్ విషయంలో ఏదైనా ముట్టజెపితేనే ఆ ఫైల్ ముందుకు పోతుంది. లేకుంటే అది తిరిగి మళ్ళీ పై పేషీకి వెళ్ళిపోతుంది. దీంతో ఈ మధ్యే ఎచ్ఎండిఏ కు వచ్చిన ఐఏఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఫైల్స్ పెండింగ్ లో పడి అనుమతులు ఆగిపోయి సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇదే నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను వర్గాలుగా విభజించి ఎచ్ఎండీఏ లో తాను అనుకున్న ఫైల్ కాకుండా ఇంకే ఏ పని కాకుండా అడ్డుకుంటూ ఉద్యోగుల మధ్య చీలికలు తెస్తూ చేసే పనులను విస్మరిస్తున్నారు. అలా వర్గాలుగా విడిపోయిన ఉద్యోగులు ఉన్నతాధికారులపై లేని పోనీ దుష్ప్రచారాలకు ఒడిగడుతూ తమకు అనుకూలంగా లేని అధికారుల మీద తప్పుడు ప్రచారాలు చేసేలా ఉసిగోలుపుతున్నారు. ప్రభుత్వ ఇతర విభాగాల నుండి ఎవరైనా ఉద్యోగులు ఎచ్ఎండీఏ లో పని చేస్తామని ఆసక్తితో వస్తే వాళ్ళను రానీయకుండా వాళ్ళు ఇచ్చే దరఖాస్తు ఫారాలను మాయం చేస్తున్నారు.
ఎచ్ఎండీఏ సంస్థ టెండర్ల విషయంలో పారదర్శకత లోపించి ఎచ్ఎండీఏ లో ఏళ్లుగా పాతుకుపోయిన నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు తమ వాళ్ళకే కట్టబెట్టేలా నిబంధనలు రూపొందించి పై అధికారులను తప్పుదోవ పట్టించి టెండర్ల విషయంలో విపరీతమైన అక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య అనే అధికారిపై ఎన్నో ఆరోపణలు వచ్చిన కానీ ప్రభుత్వం కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది.
ఈ మధ్య ఒక నాన్ రెవెన్యూ ఉన్నధికారి వద్దకు లేఔట్ పర్మిషన్ ఫైల్ రావటంతో ఆ ఫైల్ డ్రాఫ్టింగ్ అన్ని తప్పుడు తడకలుగా రాసి పై అధికారులనే తప్పుదోవ పట్టించి దాన్ని అప్రూవ్ చేసేలా పైఅధికారులను ఒత్తిడి చేయటంతో ఎచ్ఎండీఏ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి దాన్ని పసిగట్టి ఆ ఫైల్ ను పక్కన పెట్టారు. దాంతో ఆ నాన్ క్యాడర్ అధికారికి కోపం వచ్చి ఉన్నతాధికారులపై లేనిపోని ఆరోపణలు వచ్చేలా తోటి అధికారులను ఉసిగొలుపుతూ తాను పనిచేయకుండా కిందిస్థాయి అధికారులను పనిచేయకుండా తప్పుదోవ పట్టిస్తున్నాడు. అంతేకాకుండా ఎచ్ఎండిఏ లో పనులు సాఫీగా జరిగి వేగవంతం కావటానికి కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారుల ఆలోచనలకు తమదైన రాజకీయంతో మోకాలడ్డుతున్నారు.
ఎచ్ఎండీఏ సంస్థ ప్లానింగ్ శాఖలో కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి కూడా పై అధికారులకు తెలియకుండా బిల్డింగ్, లేఔట్ అనుమతుల ఫైళ్ల విషయంలో అనేక అక్రమాలకు తెరలేపుతున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఫైళ్లను పక్కదారి పట్టిస్తున్నాడు.