చలికాలంలో శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మీరు ప్రతిరోజూ ఈ టీ తాగితే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.
పుదీనా విత్ తులసి టీ..కొన్ని పుదీనా, తులసి ఆకులను నీటిలో మరిగించండి. దానిని వడకట్టి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, తేనె కలపాలి. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ టీ తాగితే జీర్ణక్రియ మెరుగై శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తులసి ఆకులతో టీ..తులసి ఆకులతో తయారు చేసే టీ మీ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కాబట్టి ఒక గ్లాసు నీటిలో 10 తులసి ఆకులను వేసి బాగా మరిగించండి. అది మరుగుతున్నప్పుడు పావు చెంచా మిరియాలపొడిని కలపండి. ఆ తర్వాత వడపోసి తేనెతో కలిపి గోరువెచ్చగా తాగితే వ్యాధుల నుండి మీకు రక్షణ లభిస్తుంది.
ఉసిరి టీ..ఒక గ్లాసు నీటిని బాగా మరిగించాలి. అందులో అందులో ఒక చెంచా మిరియాలు, జీలకర్ర వేయాలి. ఇవన్నీ మరిగిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసి కలపాలి. వడకట్టి అందులో కొద్దిగా అల్లం వేసి తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయ రసాన్ని నీరు, తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి.
అల్లం విత్ పసుపు టీ..అల్లం, పసుపు కాంబినేషన్‌తో టీ తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో పావు చెంచా తురిమిన అల్లం కలపండి. ఆ తర్వాత పావు చెంచా పసుపుతో ఆ నీటిని మరిగించండి. అల్లం, పసుపు టీ బాగా మరిగిన తర్వాత వడకట్టి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ఒక చెంచా తేనె కలపండి. భోజనం తర్వాత ఈ టీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
దాల్చిన చెక్కతో టీ..సాధారణంగా మెటబాలిజం మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక దాల్చిన చెక్కని నీటిలో మరిగించి అనంతరం వడగట్టి తేనెతో కలిపి తాగాలి.ఇలా ప్రతిరోజూ సాయంత్రం తాగితే శరీరానికి మంచి మెటబాలిజం అందుతుంది. అలానే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.