న్యూఢిల్లీ: ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) చైర్మన్ గా డాక్టర్ సమీర్ షా నియమితులయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బీబీసీకి ఓ భారత సంతతి వ్యక్తి చైర్మన్ గా ఎంపికవడం ఇదే ప్రథమం. బ్రిటన్ రాజు చార్లెస్-III బీబీసీ చైర్మన్ పదవి నియామకానికి కొన్ని రోజుల కిందట ఆమోద ముద్ర వేశారు. బీబీసీ చైర్మన్ గా సమీర్ షా పదవీకాలం మార్చి 4న మొదలవుతుంది. నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న ఆయన ఏడాదికి రూ.1.68 కోట్ల వేతనం అందుకోనున్నారు. సమీర్ షా వయసు 72 సంవత్సరాలు. ఆయనకు సొంతంగా జూపిటర్ అనే టీవీ చానల్ ఉంది. టీడీ న్యూస్, జర్నలిజంలో ఆయనకు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. సమీర్ షా గతంలో బీబీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానూ, కరెంట్ అఫైర్స్-పొలిటికల్ అఫైర్స్ విభాగం అధిపతిగానూ వ్యవహరించారు.