Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఅవినీతి కంపులో బెజవాడ కార్పొరేషన్ ఉందా..

అవినీతి కంపులో బెజవాడ కార్పొరేషన్ ఉందా..

ఈ అవినీతి అధికారి చేష్టలు చూడతరమా…
అవినీతి అధికారులకు అన్ని ప్రభుత్వాలు ఒకటేనా …
వైసీపీ లో దోచుకుని టీడీపీ లో దాచుకోవచ్చా…
ఇల్లు కట్టేవాడికి నీతిలేదా…అనుమతులిచ్చే వాడికి నీతి లేదా..
గంధం ప్రసాద్ అవినీతిలో వాటాలున్నాయా…
ఏసీపీ, డీసీపీ,సిటీ ప్లానర్ లు కూడా ..
అవినీతి సొమ్ము అంత రుచిస్తుందా…
ప్రభుత్వాలు మారినా ఫలితాలు శూన్యమేనా…
అప్పుడు వైసీపీ కార్పోరేటర్ల భాగస్వామ్యం…
ఇప్పుడు బెజవాడ ఎంపీ అనుచరుల సపోర్ట్ ఉందట ..
ప్రజలే అమాయకులు కదా…
కింద షెటర్ పైన గృహం…
అబ్బో …గంధం గారికి అవార్డ్ ఇవ్వాల్సిందే…
నిర్మాణం పూర్తయ్యాక చలానాలు…
అబ్బో ఏమి నిజాయితీ రా నాయనా …
మున్సిపల్ చట్టాలనే మార్చిన గంధం …
ఈ గంధం ప్రసాద్ కు గొప్ప వీడ్కోలు ఇవ్వాల్సిందేనా..

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
సగటు మనిషి స్వార్థం, స్వలాభం కోసం వ్యవస్థలనే ఫణంగా పెట్టి వాటి నాశనం చేస్తూ వ్యక్తి గత ప్రయోజనం కోసం పదిమందికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయ కూడదన్న లోకోత్తర ధర్మం నేటి కాలంలో నశించి పోతుంది.ఉద్యోగం అంటే ఒక బాధ్యత.పది మంది ప్రజల కష్ట నష్టాలు చూడాలి. అదే వృత్తి ధర్మం. అది మరిచిన నాడు వారిని ఏమనాలో ప్రజాస్వామ్య దేశంలో పదాలు లేకుండా పోయాయి.స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది మన హక్కు.అలా అని ఇష్టం వచ్చినట్లు చేస్తానని అనుకుంటే అది ఆ వ్యక్తి యొక్క అవివేకమే అవు తుంది. తప్పు చేసేటప్పుడు పై అధికారులు, బంధువులు చుట్టాలు కానరారు. మితిమీరిన తప్పులు చేసి చేస్తూ కూడా ఆ తప్పులన్నీ బహిర్గతం అయ్యాక కూడా సత్యాన్ని చేరిపెద్దా ములే అంటే అది తాత్కాలికమే అవుతుంది.సత్యాన్ని చేరిపెద్దా ములే అంటే అది తాత్కాలికమే అవుతుంది.మసిపూసి మారేడు కాయ చేద్దామంటే ఎలా అవుతుంది.

సత్యాన్ని చెరిపేసిన దాఖలాలు లేవు. నిజం నిప్పు లాంటిది. అది దాచిన దాగదు.కానీ ఇక్కడ అదే జరుగుతోంది. సత్యాన్ని దాచి అసత్యాన్ని పెద్దగా చూపించి ఏదో మనకు డంఖా మోగించే వారిని నలుగురిని వెంట బెట్టుకున్నంత మాత్రనా ఏది దాచలేము. అయితే బెజవాడ కార్పోరేషన్ తీరు చూస్తే ఆచ్చర్యం కలిగిస్తోంది. ఆయా ఆ అధికారి తప్పుచేసాడు ఇవిగో ఈ తప్పులు జరిగాయి అని స్వయానా రాష్ర్ట ప్రభుత్వం మున్సిపల్ శాఖలోని విజిలెన్స్ డిపార్ట్మెంట్ జీవో ఇచ్చి తొలివిడత చర్యలు చేపట్టిన తర్వాత కూడా సదరు అధికారికి గతం కంటె మరిన్ని ఎక్కువ బాధ్యత లు అప్పగించడము చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఇంతకీ ఎవరీ అధికారి అంటే టీపీఓ గంధం ప్రసాద్. ఈయన విశాఖ, విజయవాడలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించాడని విజిలెన్స్ నివేదిక ఇచ్చి మెమో కూడా ఇవ్వడం జరిగింది. అయినా బెజవాడ కార్పొరేషన్ అధికారులు ఈ గంధం ప్రసాద్ కు అతిపెద్ద బాధ్యతలు ఇచ్చారు.కార్పొరేషన్ లో 64 వార్డులు ఉంటే 23 వార్డులు అప్పగించారు. అవినీతి చేయాలంటే భయం పుట్టాలని పదే పదే ప్రసంగాలు చేసిన పాత ప్రభుత్వం లోనే ఈయన అవినీతి పతాక స్థాయికి వెళ్ళిపోయి కుళ్ళిపోయి నోటీసులు ఇచ్చి, అతి పెద్ద బాధ్యత అప్పగించారు.ఇంకేముంది అసలు రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబెడ్కర్ అయితే మున్సిపల్ రాజ్యాంగ సృష్టికర్త ఈ గంధం ప్రసాద్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రభుత్వం వైసీపీ,మేయర్ వైసీపీ, కార్పొరేటర్లు మెజార్టీ వారు వైసీపీ నే ఇంకేముంది ఫ్యాన్ గిరా గిరా తిరిగి నట్టు అక్రమ కట్టడాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. నిర్మాణం చేపట్టాలంటే కార్పొరేటర్ ద్వారా అయితే ఒక రేటు,నేరుగా అయితే ఇంకో రేటు అసలు రేటు చెప్పనదే రైట్ అని చెప్పేది లేకపోయే.

ఓ వైపు ప్రజల కష్ట సుఖాలు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులని పెడవాడికి పట్టేడన్నము పెట్టడానికి కూడా వెనుకాడి ఒకటో తేదీన జీతాలు ఇస్తుంటే అవి సరిపోవన్నట్టు తమ అవినీతి పొట్టలు నింపుకోవటానికి ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా అక్రమాలకు అండగా నిలిచి కార్పొరేషన్ కు గండి కొట్టి కోట్లు రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇంకో విచిత్రమేమిటంటే భవానిపురం ఐరన్ యార్డ్ లో నిర్మాణా లు జరుగుతున్నాయి.ఒక షెడ్ కు అయితే అసలు దరకాస్తు కూడా చేయలేదు.పదే పదే వార్తా కథనాలు వస్తుండటంతో ఏదో మొక్కుబడిగా చలానా కష్టించి నట్లు సమాచారం. ఇంకొక అతిపెద్ద నిర్మాణం అయితే అనుమతికి దరఖాస్తూ చేసింది గృహము, అక్కడ కడుతుంది వ్యాపారముకు అనుకూలంగా ఉండేది.ఇది ఎలా అంటే అదే గంధం రాజ్యాంగం. ఇక స్వాతి సెంటర్ లోని మానవ మందిరం రోడ్డు లో అయితే అది ఆ మనవుడికే తెలియాలి మరి.ఇలా చెప్పుకుంటూ పోతే భవానిపురం అక్రమ నిర్మాణాల కథలు సీబీఐ కూడా నిగ్గు తేల్చుకోలేకపోతుందేమో అన్న ధర్మ సందేహం కలుగుతోంది. ఇప్పటికయినా కమిషనర్ ధ్యాన చంద్ర గారు ఇప్పుడున్న ద్యాస కంటే ఇంకొంచెం ద్యాస పెడితే బాగుంటుందని ఆ ప్రాంత ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article