Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఇది నిజమేనా…?

ఇది నిజమేనా…?

పాటల మాంత్రికుడు ఉన్నాడట..‌!
బాలుగారు ఉండి ఉంటే ఏమయి పోయేవారో…
పది వేలు ఇచ్చి పది పాటలు ఇవ్వాలనడడం …
ఫలానా వారితోనే పాటలుండాలని అనడంలో అర్థం…?
ఆ ముష్టి కోసం అన్నీ ఊ అంటున్న వైనం..
ఘంటసాల, ఇళయరాజా జేసుదాసు లు ప్రేమ పాటలు పాడితే..
ఆహా అమోఘం అంటున్నారు ..
అవే పాటలు మాంత్రికుడు పాడితే…
హరిశ్చంద్ర లో కాటుసీను అయ్యే…
మాటలే సరిగా స్పష్టం రావు…మళ్లీ తానొక …?
ఇది కదా కళామాతల్లి కన్నీరు కార్చేది…
వాలిపోతున్న వయస్సు లో ఈ వయ్యారాలేల..
మాంత్రికుడా…మాటల తాంత్రికుడా…

(రామమోహాన్ రెడ్డి, సంపాదకులు)

అయ్యో కళామాతల్లి కి ఎంతటి కష్ట మొచ్చినదో.పాటలే సరిగా రావు ఇక పాడటం చూస్తే ప్రేక్షకులకు తప్పని పరిస్థితుల్లో చప్పట్లు కోట్టాల్సి వస్తుంటే…రూపాయలు ఉన్నాయని రూపాలు మార్చుతూ లేనిది ఉన్నట్లు చూపించుకోవాలని చేస్తున్న చేష్టలుడిగిన చేష్టలు చూసి కళామాతల్లి కన్నీరు కారుస్తుంది. పదివేలు ఇచ్చి పది పాటలు కావాలని డిమాండ్ చేయడం అవి కూడా ఫలానా వారితోనే ఫలానా పాటలు పాడతా అంటే ఆ పది రూపాయలకోసం ఆ సంస్థ లు ఉ అంటుంటే పెద్ద పెద్ద ఫోటోలు ఉండాలి…పెద్ద పెద్ద బిరుదులుండాలి ఇలా ఒకటి కాదు వాలిపోతున్న వయస్సులో వయ్యారాలు చూసి వారినీ వేశాలో అంటూ వినుకిది వినిపిస్తుంది. మాటల్లోనే స్పష్టత లేదు తెలుగు నుడికారాలు సరిగా పలకడం రాక పోయిన రూపాయలు ఉన్నాయని రూపం చూపిస్తూ ఆ రూపాయి తో అందరి రూపాలను కూడా తారుమారు చేయాలని చూస్తుంటే తప్పని పరిస్థితులలో తడబాటుకు గురిఅవుతూ తమలో తాము తపన చెందుతున్నారు కొందరు.శ్రీ పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం నే పాటల మాంత్రికుడు అనుటకు ఎన్నో దశాబ్దాలు పట్టింది.పాటకు, పల్లవి కి శృతి కి లయకు అసలు పాటలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలియని పూటకో ఒక చోట ట్రాక్ ల మీద పాడే ఇతగాడికి ఆ బిరుదు ఎవరిచ్చారు… అందుకు అర్హత ఉందా…ఇచ్చేవారు ఏ ప్రామాణికం చూసి ఇచ్చారు…ఏ రూపాయి ఆశపడి ఇచ్చారు ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పాట అంటేమాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.పాటలోని భాగాలు ..పల్లవి: పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.అనుపల్లవి: పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.పాటల రకాలు ఎన్ని ఉన్నాయంటే అప్పగింతల పాటలు,ఎంకి పాటలు,కలుపు పాటలు,కూనలమ్మ పదాలు,కోతల పాటలు,గొబ్బిళ్ళ పాటలు,చెక్కభజన పాటలు,జట్టిజాం పాటలు,జానపద గీతాలు,జోల పాటలు,దేశభక్తి గేయాలు,నాట్ల పాటలు,,నీలగిరి పాటలు,పిల్లల పాటలు,పెళ్ళి పాటలు,లాలి పాటలు,మంగళహారతి పాటలు,మేలుకొలుపు పాటలు,భక్తి పాటలు,విషాద గీతాలు,యుగళ గీతాలు,శివుని పాటలు,సినిమా పాటలురాముని పాటలుఇలా ఇన్ని రకాలున్నాయి.ఇక గానం అంటే గానం అనేది కంఠ స్వరంతో సంగీత ధ్వనులు ఉత్పత్తి చేసే ఒక కళ. గానం చేసే వ్యక్తిని గాయకుడు లేదా గాత్రధారి అంటారు. వినసొంపుగా గానం చేసే వారిని గాన కళాకారులు అంటారు. గాయకులు సంగీత వాయిద్యాలతో తోడుగా లేదా లేకుండా పాటలు పాడుతారు. గాయకులు గాయక బృందం లేదా వాయిద్యకారుల బృందం వంటి సంగీతకారుల బృందంలో పాడటం తరచుగా జరుగుతుంది. గాయకుడు సహగాయకులతో కాక ఒంటరిగా ప్రేక్షకుల కోసం పాడితే దానిని సోలో గానం అంటారు. సోలో గానంలో ఎంతమంది సంగీత వాయిద్యకారులు సంగీతాన్ని వాయించినప్పటికి గానం చేసేది మాత్రం ఒకే ఒక్క గాయకుడు మాత్రమే. ఇది మత భక్తి యొక్క రూపంగా, అభిరుచిగా, ఆనందం, సౌకర్యం, ఆచారం యొక్క మూలంగా, సంగీత విద్యలో భాగంగా లేదా వృత్తిగా చేయవచ్చు. గానం చేయడంలో రాణించడానికి సమయం, అంకితభావం, బోధన, క్రమమైన అభ్యాసం అవసరం. రోజూ ప్రాక్టీస్ చేస్తే, శబ్దాలు మరింత స్పష్టంగా, బలంగా మారతాయి. వృత్తిపరమైన గాయకులు సాధారణంగా వారి వృత్తిని క్లాసికల్ లేదా రాక్ వంటి ఒక నిర్దిష్ట సంగీత శైలిని ఎంచుకుంటారు, అయితే కొంతమంది వృత్తిపరమైన గాయకులు ఒకే రకం గాన కళపైనే కాక క్లాసికల్, రాక్ వంటి ఇతర గాన కళలలోను తమ గాన ప్రతిభను ప్రదర్శించి రాణించగలుగుతారు. గాన విద్యార్థులు గానం చేయుటలో మెళకువలు నేర్చుకొనుటకు సంగీత పాఠశాలలో చేరి గాత్ర బోధకుడు లేదా స్వర శిక్షకుడి నుండి గాత్ర శిక్షణ పొందుతారు. గాన శిక్షణలో రాణించిన గాన విద్యార్థులు వృత్తిపరమైన గాయకులుగా ఎదుగుతారు. కొంతమంది గానశిక్షణ తీసుకోకుండానే స్వయం అభ్యాసం ద్వారా వృత్తిపరమైన గాయకులుగా రాణించారు. ఉదాహరణకు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం స్వయం అభ్యాసం ద్వారా గాన కళాకారిడిగా కీర్తి గడించారు.మరి ఇంతటి గానాన్ని వినిపిస్తాడా ఈ పాటల మాంత్రికుడు. ఇక శృతి లయలు గురించి చెప్పాలంటే శ్రుతిని శృతి అని కూడా అంటారు. భారతీయ సంగీత చరిత్రలో అనేక సందర్భాలలో వాడబడిన ఒక సంస్కృత పదం శృతి. మానవుని చెవి గుర్తించే స్వరస్థాయి యొక్క చిన్న విరామాలను శృతి అంటారు. శృతి యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికి, దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి భారతీయ సంగీతంలో అనేక సందర్భాలలో ఈ పదాన్ని ఉపయోగించారు. రెండు గమనికల యొక్క స్పష్టమైన వ్యత్యాసాన్ని, వాటి మధ్యగల అంతరాన్ని అర్థం చేసుకోవడానికి భారతదేశంలో శృతిని ఉపయోగించారు. వీరు మధురమైన శ్రావ్యం కోసం శ్రావ్య నిర్మాణములను ఒక పద్ధతి ప్రకారం తరగతులుగా రూపొందించుకున్నారు. వీరు తదుపరి షడ్జమంగా, మధ్యమంగా విభజించారు. విరామాల చేత వేరు చేయబడిన గమనికల (స్వరాల) కొలత పద్ధతికి శృతిని ఉపయోగిస్తారు.లయ లేదా రిథమ్ అనేది సంగీతంలో పునరావృతమయ్యే పల్స్ లేదా బీట్ ఉపయోగించడం ద్వారా సృష్టించబడుతుంది, ఇది శ్రావ్యత, సామరస్యానికి పునాదిని అందిస్తుంది. రిథమ్ అనేక కళారూపాలలో ముఖ్యమైన భాగం,, ఇది మన భావోద్వేగాలు, శారీరక ప్రతిస్పందనలపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. రిథమ్ అనేది ప్రతి ప్రధాన “బీట్” లేదా యాస మధ్య సమయం యొక్క నిడివిని సూచిస్తుంది, ఉదాహరణకు సంగీతం యొక్క భాగం. ఇది లయను రూపొందించే శబ్దాలు, నిశ్శబ్దాల క్రమం. సాధారణ, సమంగా ఉండే బీట్‌ల సమూహం యొక్క మొదటి బీట్ సాధారణంగా బీట్ల కంటే బలంగా అనిపిస్తుంది. మనం సంగీతాన్ని వ్రాసేటప్పుడు, మనం ప్రతి సమూహాన్ని బార్‌లలో ఉంచుతాము (లేదా “కొలతలు”).లయలు వేర్వేరు నమూనాలను కలిగి ఉంటాయి, వీటిని చప్పట్లు కొట్టటం ద్వారా సూచించవచ్చు. పాశ్చాత్య సంగీతంలో, ఈ నమూనాలు సాధారణం:1 2, 1 21 2 3, 1 2 31 2 3 4, 1 2 3 4.సంగీతంలో, సంగీత గురువు సంగీతం యొక్క టెంపో లేదా వేగాన్ని సూచించడానికి కర్ర లేదా వారి చేతులను ఉపయోగించి సమయాన్ని కొడతారు, ఈ బీట్‌కు సంబంధించి సంగీతం యొక్క లయ ప్లే చేయబడుతుంది లేదా పాడబడుతుంది. గురువు యొక్క కదలికలు ప్రదర్శనకారులకు సంగీతం యొక్క డైనమిక్స్, పదజాలం, ఇతర వ్యక్తీకరణ అంశాలను సూచించడంలో సహాయపడతాయి, ఇది ఏకీకృత వివరణను అనుమతిస్తుంది. స్థిరమైన బీట్‌ను ఉంచడం ద్వారా, గురువు ప్రదర్శన అంతటా లయ యొక్క స్థిరమైన భావాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది, ప్రేక్షకులకు సమన్వయ, చక్కగా వ్యవస్థీకృత సంగీత అనుభవాన్ని సృష్టిస్తుంది. ఇంతటి గొప్పగా ఉన్నా వాటి గురించి తెలుసా అంటే ఓహో శృతి లయ అయితే నేను వారి తోనే పది పది పాటలు కావాలంటే ఇంకో పదివేలు ఇస్తా అనడమా…ఇక తాళం గురించి చూస్తే తాళం అనేది పాటకు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గులు లేకుండా నికరంగా జోడించి, శ్రోతలను తన్మయుల్ని చేయించగలిగేది తాళము. రాగము, తాళము మన కర్ణాటక సంగీతం యొక్క ప్రాణములు, ఐరోపా సంగీతములో మన సంగీతములో కల పలువిధములైన తాళములు ఉన్నాయి.తాళము” అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద. ఒక వస్త్రమును అర్థ గజము, పావుగజము, రెండు, మూడు గజములు మొదలైన కొలతలతో ఎట్లు మనం కొలబద్దతో కులుచు చున్నామో, అట్లే సంగీత గానమును కూడా చాలా విధములైన తాళములచే వాటివాటిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ఏడు, ముప్పదిఐదు, నూట ఎనిమిది రకములుగా వ్యవహరించుట గలదు. పూర్వీకులు ఎన్ని రకములైన తాళములు కనుగొన్ననూ ప్రస్తుతం 35 రకాల తాళములు అందుబాటులో ఉన్నాయి.ధ్రువ తాళం: చతురస్రం – 4+2+4+4 = 14మఠ్య తాళం: చతురస్రం – 4+2+4 = 10రూపక తాళం: చతురస్రం – 3+4 = 6ఏక తాళం: చతురస్రం – 4త్రిపుట తాళం: త్రిశం – 3+2+2 = 7ఝంపె తాళం: మిశ్ర జాతి – 7+1+2 = 10ఆట తాళం: ఖండ జాతి – 5+5+2+2 = 14పంచత్రింశతి సంగీత తాళములుమార్చు, ధ్రువ, మధ్య, రూప, ఝంప, త్రిపుట, ఆట, ఏక, మణి, సార, చక్ , కదంబ, శంఖ, గుప్త, సుధ, ప్రమాణ, ఉదయ, రాజ, చణ, దుష్కర, విదశ, రత, పూర్ణ, ఉదీర్ణ, కుల, సుర, లీల, లోయ, రాగ, బువన, రావ, బిందు, కర, భోగ, ధీర, వసు ఇన్నిఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే.ఇలా ఇంకా బోలెడు ఉన్నాయి. ఇలా శృతి లయ రాగం తానం పల్లవి అనుపల్లవి ల మేళవింపుతో సరిగమలతో సయ్యాటలు ఆడే మహాగాయకుల బిరుదును తనకు తానే తగిలించుకుని తానొక శ్రీపతి ని మించిన వాడినని అందరిని ముంచుతూ ఉంటే ఈ మాయ ప్రపంచంలో కళామాతల్లి తీరు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారు అయ్యిందని కళాభిమానులు కలత చెందుతున్నారు. ఇలాంటి నకిలీ ల వల్ల కళారంగం నాశనమవుతుందని ఆ నోట ఈ నోట వింటుంటే ముక్కున వేలేసుకుంటున్నారు నిజమైన కళాకారులు.ఈ విధానం మారాలని సరదా కోసం పాటలు పాడటం తప్పు కాదని ఆ సరదాలో సంగీత విద్వాంసులకు సైతం చీత్కారాలు పుట్టే విదంగా చేయడమే సరియైన విధానం కాదని పలువురు సంగీత ప్రియులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article