శ్రీచైతన్య అంటే చిత్తు చిత్తు అయి పోవాల్సిందే ..
కడపలో ఫీజుల పేరుతో దోపిడీ..
పదవతరగతికి హాస్టల్ లో ఉంటే లక్ష..
పుస్తకాల కోసం పుస్తీలు అమ్ముకోవాల్సిందే ..
పూట పూట ఫీజు చెల్లించాల్సిందే ..
నవంబర్ లో మొత్తం ఫీజు చెల్లింపు చేయాల్సిందే..
విద్యా హక్కు చట్టం అమలు ఇదేనా..
పరిశుభ్రత ఉండదు…పిల్లలు కు రోగాలు వచ్చినా దిక్కులేదు…
కేవలం డబ్బే ప్రామాణికం…జబ్బు చేస్తే అంతే..
విద్యాశాఖ ఉందా.. ఉంటే నిద్రమత్తులో ఉందా. .
లేక కార్పొరేట్ కట్టల మత్తులో ఉందా..
ఇదేనా ప్రభుత్వ లక్ష్యం..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
గురువు అనగా అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించేవాడు అని అర్థం. వర్తమాన కాలములో గురువు అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. విద్యాలయం అంటే దేవాలయం అని అర్థం. విద్య విచక్షణ ను నేర్పిస్తుంది. జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ జ్ఞానం పదిమందికి పంచేలా చేస్తుంది. ఇక విద్య అనగా బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా,మానవునిలో దాగివున్న అంతర-జ్ఞానాన్ని వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర-జ్ఞానాన్ని ప్రసాదించింది.దానికి సానబెట్టి వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం చేశారు.ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలౌతుంది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. పాఠశాల నిర్వహణ కమిటీ, లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి.వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.నిధులను 55-45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా విద్యాలయాలు అన్నీ కూడా కలుషితం అయ్యాయని చెప్పాలి.కేవలం దనార్జనే ద్యేయంగా పిల్లల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న పరిణామాలు చోటుచేసుకుంటుంటే గతిలేక పిల్లల చదువు అనే ఒక్కటి కోసం ఎంతో మంది తల్లిదండ్రులు చతికిల బడి చేసేది లేక కార్పొరేట్ స్కూల్ మాయలో పడి కుళ్లి పోతున్నారు. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వైఎస్సార్ కడపజిల్లా లో శ్రీచైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి.జిల్లా కేంద్రంలో బైపాస్ లో అనేక క్యాంపస్ లు ఉన్నాయి.ఇందులో మగపిల్లలు చదివే k5 అనే బ్రాంచ్ లో పిల్లల జీవితాలతో ఆడుకునే విదంగా సాగుతుంటే పట్టించు కునే నాధుడు కరువయ్యారు.పదవ తరగతి చదవాలంటే అక్షరాల హాస్టల్ ఫీజు తో కలిపి లక్ష చెల్లించాలి. ఆపై పుస్తకాలు యూనిఫామ్ పాకెట్ మని ఇలా ఒక విద్యార్థి ఒక ఏడాది చదవాలంటే దాదాపు ఫీజులు అన్నీ కలిపి లక్ష దాటి అపై ఓ ముప్పై వేలు చెల్లించుకోవాలి.మళ్లీ అదికూడా మొదటి నెల నుంచే ఫీజు చెల్లించాలి మొత్తం. ఏడాది చివరికి ఉన్నా ఫీజులు మాత్రం మొదటి అర్ధ సంవత్సరం లోపే పూర్తిగా చెల్లించాలి.లేదంటే పిల్లలకు నరకయాతన తప్పదు.పాఠశాలలో చదువు హాస్టల్ లో అన్నము ఎలా ఉన్నా సరే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా సరే బాగుంటే ఓకే లేదంటే ఇంటికి వెళ్ళు ఇంటి నుండి తిరిగి వచ్చావ డబ్బులు తెచ్చావ ఇదే గోల.అంటే అక్కడ విద్యా ప్రమాణాల కంటే డబ్బు కే విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఒక వేల వారు అడిగినంత డబ్బులు చెల్లించక పోతే అవసరమైతే పిల్లలు ను పాఠశాల ప్రాంగణంలో కి రానివ్వని పరిస్థితి. ఈ దుస్థితి చూసి తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి గత మూడు సంవత్సరాలు గా అదే క్యాంపస్ లో చదువుతున్నాడు.అక్కడ చేరిన మొదటి ఏడాది పర్వాలేదు అని చూపి తర్వాత నుండి వారి వేషాలు మొదలయ్యాయి. పాఠశాల లో చేరిన మొదటి రోజు తీపి మాటలు మొదలవుతాయి.ఆ తరువాత వారి దన దాహం బైటకి వస్తుంది.ఫీజులు చెల్లించలేదని యూనిఫామ్ పేరిట చిత్రహింసలు చేయడం వినాయక చవితి కి ఫీజు,దసరాకు ఫీజు దీపావళి కి ఫీజు అంటే వారు ఎడదయితే చెప్పారో అది మొత్తం చెల్లించాలి. లేదంటే ఆ పిల్లలకు స్కూల్ గేటు నుండి అవమానం మొదలు అవుతుంది. మరి ఇంత జరుగుతుంటే విద్యా హక్కు చట్టం ఏక్కడ అమలవుతున్నట్లు ప్రభుత్వాలు అమలు చేస్తున్న ,తీసుకుంటున్న చర్యలు ఎక్కడ ఫలితాలు ఇస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు ఏమి చేస్తున్నట్లు ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి దారుణ సంఘటన చోటుచేసుకుంటుంటే ఆడిగివాడు లేకపోకడమే కారణమా లేక అవినీతి కి అలవాటు పడి ఇలా అవుతుందా అన్నది అర్థం కావడం లేదు .దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారిణి ని వివరణ కోరగా పిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.