Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్న్యాయం గెలిచినట్టేనా..?

న్యాయం గెలిచినట్టేనా..?

హైకోర్టులో వచ్చింది స్కిల్ బెయిలేగా
మద్యం, ఇసుక ఓ ఆర్ ఆర్ ,ఫైబర్ నెట్ ల సంగతేమిటి
ఇది నేతల అత్యుత్సాహమేనా
(ఏ.రామమోహన్ రెడ్డి,సీనియర్ పాత్రికేయులు)
ఇక రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయా టీడీపీ ప్రభంజనం లో వైసీపీ కొట్టుకుపోతుందా.చంద్రబాబు దెబ్బకు వైసీపీ అబ్బా అంటుందా అబ్బే అదేమీ లేదంటారా ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం లో నడుస్తున్న రచ్చ ఇదే.టీడీపీ నేతలు సత్యం, న్యాయం గెలిచింది అంటుంటే వైసీపీ నేతలు అబ్బే అంత సీను లేదు ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు.దీంతో ఎవరి అభిమానులు వారి అభిమానాన్ని ఉవ్వెత్తెన ఎగిసిపడేలా సంబరాలు చేసుకుంటు న్నారు. వాస్తవానికి చంద్రబాబు కు వచ్చింది బెయిల్ మాత్రమే కేసు ఉంటుందా ఊడుతుందా అనేది ఇప్పట్లో తేలే అంశం కాదు.ఎందుకంటేఈ భారత దేశంలో ఉన్న వేల కేసుల్లో ఇదొకటి.కోర్టుల్లో కుప్పలు కుప్పలుగా కేసులు ఉన్నాయి.కేసుకు సంబంధించి వాదనలు వినిపించే క్రమంలో న్యాయమూర్తికి ఆ సమయంలో ఏ వాదన సరియైనది, నేరము మోపబడిన వ్యక్తి ఉన్న పరిస్థితి,ఇతర అంశాల ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారు.వాస్తవానికి చంద్రబాబు ఈ దేశంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన రాజకీయనేత.ఈ విషయం ఎవరు కాదన్న ఔ నన్న వాస్తవం అదే.దీంతో పాటు దేశ రాజకీయాల్లో ఓ చరిష్మా కలిగిన నేత అని కూడా ఒప్పుకోవాల్సిందే.అలాంటి నేత తన సుదీర్ఘ రాజకీయ అనుభవం లో మొదటిసారి జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేశాడేమో అన్న సందేహం అన్ని వర్గాలనుండి వ్యక్తమవుతోంది.అదే ఆయన జీవితంలో ఊహించని మలుపు తిప్పి ఈ రోజు ప్రజాక్షేత్రం లో ఒక దోషిగా ప్రస్తుతానికి నిలబడే పరిస్థితి వచ్చింది. న్యాయ న్యాయాలు న్యాయస్థానాల్లో తేలి శిక్షలు పడ్డ దిగువ కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకోవడం సహజం. అంత మాత్రాన తాత్కాలిక ఇబ్బందులు అయతే తప్పవు.ముఖ్యమంత్రి తనయుడి గా ఉండి ఎంపీ హోదాలో ఉన్నాకూడా వైఎస్ మరణాంతరము మాత్రమే అదికూడా సోనియాగాంధీని ఎదురించి నిలబడ్డాడు అన్న ఓకే ఒక్క కారణంతో జగన్ జైలు జీవితం అనుభవించాడు.రాష్ట్రం విడిపోవడం,బెయిల్ రావడం చక చక జరిగి పోయాయి. కాలం కలిసొచ్చింది కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఎన్నికల్లో తలపడి ఓడినా ఓటమిని లెక్కచేయకుండా పోరాటం సాదించి చివరికి అనుకున్నదే చేసాడు జగన్.అయితే జగన్ అరెస్టు చేసే విషయంలో చంద్రబాబు పాత్ర ఉందని బలంగా విశ్వసించిన జగన్ చంద్రబాబు ను అరెస్ట్ చేయాలన్న పట్టుదలతో ఉన్న జగన్ తన పోరాటం లో చివరికి స్కిల్ కేసులో అరెస్ట్ చేసి అనుహ్యరీతిలో జైలుకు పంపారు. ఇక ప్రజాక్షేత్రం లో చంద్రబాబు ను కూడా ఓ దోషిగా నిల బెట్టగలిగాడు. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాలు చూపడం యువనేత ఢిల్లీ లో చక్రం తిప్పడం తో ఎట్టకేలకు బెయిల్ ఒక్క కేసులో మాత్రమే వచ్చింది. దీనినే టీడీపీ నేతలు ప్రజా బాహుళ్య ములో సత్యం గెలిచింది, న్యాయం గెలిచిందని ఊకదంపుడు ప్రసంగాలు మొదలు పెట్టడం కొంత విడ్డురమనే చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అలా అయితే ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో కూడా చాలా వరకు జగన్ విజయ సాయిరెడ్డి మినహా ఇతరుల కేసులు కొట్టువేయడం కూడా జరిగింది.మరీ దీన్ని ఏమనాలి..చంద్రబాబు కు వచ్చింది తాత్కాలిక ఊరట నా లేక పూర్తిస్థాయి ఉపసమనం కలిగిందో మేధావులు చెప్పాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article