Thursday, January 16, 2025

Creating liberating content

రాజకీయాలుప్రేమ రెండక్షరాల పదమా..?

ప్రేమ రెండక్షరాల పదమా..?

రెండు శరీరాల మధ్య వ్యామోహమా .. కామమా..
సహజీవనం కూడా ప్రేమంటారా..
ఓ వితంతువు…ఓ వివాహితుడితో ఉంటే ప్రేమేనా..
ఓ పై అధికారి తన చిరు ఉద్యోగితో ఉంటే ప్రేమేనా..
ఓ చీఫ్ చిల్లర పనులు చేస్తున్నా ప్రేమేనా..
అరవై ఏళ్ల వృద్ధుడు కూడా ప్రేమలో ఉండొచ్చా..
సిద్ధాంతాలు చెప్పేవారు సిగ్గు మాలిన పనులు చేస్తే ప్రేమేనా..
పైసలతో పేద వారిని ఉచ్చులో దింపితే ప్రేమేనా..
పెళ్లై పిల్లలు ఉన్నా…బజారు కెక్కితే ప్రేమేనా..
ఇదేనా లైలా మజ్ను చేసింది..
ప్రేమ ముసుగులో పాడుపనులు చేసినా ప్రేమేనా..
ప్రేమిస్తే సరే లేదంటే ఆసిడ్, హత్యలు చేయడం ..
ప్రేమించలేదని పురుగుమందు బాటిళ్ల తో బ్లాక్ మెయిల్ చేస్తుంటే..
నా బిడ్డ దత్తత తీసుకుంటానంటూ నెత్తిన చేతులు బెడుతుంటే..
సిగ్గుమాలిన పనులు చేస్తూ సంచిలో డబ్బులు ఉన్నాయంటూ..
కారెక్కితే ఓకే లేకపోతే కారుకూతలు కూస్తే..
ప్రేమించకుంటే చేతబడి చేస్తారని బెదిరింపులు..
ఏదిరా ప్రేమ..ఎవరిదిరా ప్రేమ..
ఏది వ్యామోహం… ఎందుకురా ఈ తీరని శోఖం..
వారేమీ చేశారూరా పాపం..
ప్రేమ ముసుగులో పాడుపనులకుపుల్ స్టాప్ పడదా..?

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
కామాతురాణాం నభయం నలజ్జ అన్నారు పెద్దలు…కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి సిగ్గు లజ్జ ఉండదన్నది అర్థం..ఇలాంటి పనులు చేసే వాళ్ళు ప్రేమ అనే ముసుగులో చేస్తున్న అరాచకాలకు ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. లైలా మజ్ను లను ఇప్పటికి గొప్ప ప్రేమికులు గా ఆరాధిస్తారు.అయితే ప్రేమలో ఉన్న గొప్పతనం ఆ మాధుర్యాన్ని వీధి కుక్కలుగా తిరిగే వారు కూడా అన్వయించుకుని చెలామణి అవుతుంటే నవ్విపోతుంది ఈ సమాజం.రెండు శరీరాల మధ్య ఉన్న కామాన్ని వ్యామోహాన్ని కూడా ప్రేమ అనే ముసుగు వేసుకుని బజారు పాలు చేస్తుంటే సిగ్గుతో చస్తుంది ఈ సమాజం.భార్య పిల్లలు ఉన్నా ఇంకో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని పట్టుబడితే ప్రేమ అనే అర్థం పలుకుతూ సిగ్గు విడిచి బ్రతుకున్నా కొంతమంది వెధవలను చూసి పక్కున నవ్వుతోంది ఈ నారీ లోకం.ఓ వితంతువు తనకు పెళ్లికి వచ్చిన పిల్లలు ఉండి భార్య పిల్లలు ఉండిన వాడితో సహజీవనం చేస్తుంటే… ఆ యుగపురుసుడు ఇంట్లో భార్యను,ప్రేమస్తున్నా నిన్నే అని ఎంతటి పాడు పనులు చేసిన సరే అంటే ఆ యుగపురుసుడు ఇంకో వివాహిత కోసం అర్రులు చాచుతూ గొప్పలు చెబుతూ బడాయి మాటలు మాట్లాడే నీచులు కూడా ఇదంతా ప్రేమ అంటే ఇంకేమానాలో మరి అర్థం కాని పరిస్థితి. తామంతా సిద్ధాంతాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటూ వయస్సు మించిన పనులు చేస్తూ సిగ్గు విడిచి కారులో ఒకరు, ఊరికి ఒకరు రంగానికి ఒకర్ని ఎంచుకుని చిల్లర పనులు చేస్తే కూడా దాన్ని కూడా ప్రేమే అంటారంటా ఈ పనికి మాలిన పెద్దమనిషి,అతగాడికి చప్పట్లు కొడుతున్న సిగ్గులేని వానర సైన్యాన్ని ఏమనాలో ఇంకేమానాలో అర్థం కాని పరిస్థితి. ప్రేమించలేదని పురుగు మందు బాటిళ్ల ను పంపితే వాడిని ఏమనాలి.వపంపిన వాడు పదహారేళ్ళ పడుచు పిల్లాడు కాదు ఆరుపదుల వయస్సు పైబడి అందులో సగం వయస్సు కూడా లేని ఓ ఆడ పిల్లకి ఉంగరాలు గింగరాలు ఉన్నాయమి ఊరికి ఒకరిని ముంచి చివరికి చితికి చేతపూడి చేసి పంపిన వారు రమనా అని రాలుపోయెలా చేసి రంగులు మారుస్తూ రాక్షసానందం పొందుతుంటె ఇది కూడా ప్రేమే అనాలా..ఒకడు శారీరక అంగ వైకల్యం ఉన్నా ఒకరితో పిల్లలు కని ఇంకొకరితో చెల్లి అంటూ చెలి ని చేసుకుని ఆ చెల్లి రూపంలో ఉన్న చెలితో కలిపి ఇంకొక కాపురం లో నిప్పులు పోసేంత పని ఆ కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలని చూసిన కుంటోడు కూడా ప్రేమ అన్న ట్యాగ్ లైన్ వేసుకుని చివరికి కాటికి పోయాడు. ఇక ఆ వంకతో వరుసలు కలిపిన ఓ మాయగాడు వయస్సు కు అయినా విలువ ఇవ్వకుండా వాట్సప్ లలో ముద్దులు పంపుకుంటూ ఉంటే వాడిదొక ప్రేమ.ప్రేమించి పెళ్లి చేసుకోలేదని మర్మాంగాలు కోసేస్తే అది కూడా ప్రేమే. లోకం తెలియక ఉంటే ప్రేమించలేదని యాసిడ్ దాడి చేస్తే అది ప్రేమే.పాచ్ఛాత్య సంస్కృతికి అలవాటు పడి విచ్చలవిడిగా భరి తెగించి తిరుగుతూ కూడా ప్రేమ అనే పవిత్రమైన అర్థాన్ని కించ పరిచే విదంగా ప్రవర్తిస్తున్న ఈ సిగ్గులేని జనాన్ని కూడా పెద్ద మనుషులుగా చూడడం వల్లే లోకం తెలియని ఎంతో మంది ప్రేమ అనే ముసుగులో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.అక్రమ సంబందాలకు కూడా ప్రేమ అన్న పవిత్ర మైన పదాన్ని తగిలించి తన్నులాడుకోవడం కూడా జరుగుతుంటె ఇవన్నీ కూడా నేటి యువతరాన్ని మంచి వైపు కాకుండా చెడు వైపు ప్రేరేపితం చేస్తున్నాయి.సమాజానికి హితం చేయక పోగా సమాజాన్ని మరింత ప్రమాదంలో కి నెత్తివేయబడిడుతున్నాయి అనేక పరిశ్రమలు. అటు సినిమా రంగం కావచ్చు ఇటు సామాజిక మాధ్యమాలు కూడా యువకుల జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.ఎన్ని అవగాహన సదస్సులు ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోందని చెప్పాలి. పైన చెప్పుకున్న సంఘటనలు కేవలం కొన్ని మాత్రమే ఇంకా బోలెడు ఉన్నాయి…ఇప్పటికయినా యువతరం ప్రేమ అనే పదానికి నిజ మైన అర్థం తెలుసుకుని మనుగడ సాగిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు సమాజ శ్రేయస్సు కోరే పెద్దలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article