గాత్రంతో పనిలేదా..గాత్రానికే పనిలేదా…
స్వరంలో మాధుర్యం అక్కర్లేదా..
సంచులు నింపితే చాలా…శృతి లయలు లేకపోయినా ఓకేనా…
సఫాసతో పనిలేదు …పైసలిస్తే పదనిసలు
సర్దుకుపోతాయంట అనులోమ విలోమాలా …
ఛీ..ఛీ..వెయ్యి ఇచ్చుకో ఓ పాట పాడుకో…
వింటే వినని… వినక పోతే పోనీ…
ప్రభుత్వ ఉద్యోగులం మేము పైసలిస్తాం పాడుకొంటాం…
మాపాట…మా ఇష్టం ..
అడిగేవాడేవాడు…ఆపేవాడేవడు…
ఉక్కుమహిళ, గానగంధర్వులు అండగా ఉన్నారట…
రాసుకో చూసుకో… మమ్మల్ని పీకేవారెవరూ లేరు…
మా చందాలు మావి…మా ఖర్చు మాదీ…
విజయవాడ:
గానం గాడితప్పుతోందా..గాత్రం తో పనిలేదు…గాయకులు అవ్వాల్సిన అవసరమే లేదు…ఓ వెయ్యి ఇచ్చుకో ఓ పాట పాడుకో వింటే వింటారు ..పోతే పోతారు.. మాకేంటీ మాకు డబ్బులు కావాలి మీకు స్టేజీ ఎక్కించాలి అంతేగా ..ఎవరైనా విమర్శిస్తా రా…వార్తలు రాస్తారా ..అబ్బే అవేమి మాకు పట్టవు ..ఎంతో కాలంగా కళామతల్లి ముసుగులో మా వ్యవహారం మాదే ఇది కళామతల్లి ముసుగులో అనేక అక్రమాలకు నిలయంగా మారిన కొన్ని కళాసంస్థల అధినేతల తీరు. శృతి లయలు, సఫాస లు అంటే ఇక్కడి కొన్ని కళాసంస్థల అధినేతలకు భూతుమాటలు అవుతున్నాయి.దీనితో పాటు దీర్ఘ కాలంగా కళామతల్లి ముసుగులో వేల కార్యక్రమాలు చేశామని ఆ సేవలు చూసి పొంగి పొర్లిపోయిన ఇతర దేశాలు సైతం గౌరవ పీహెచ్డీ లు.ఇచ్చామని చెప్పుకుంటూ పబ్బం గడపుకోవడం పరిపాటిగా మారిన ఈ తరుణంలో నిజంగా గాయనీ గాయకులు అంటే ఇలా ఉంటారా అన్న మీమాంసకు దారితీస్తున్నాయి ఇక్కడి పరిస్థితి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సరదా కోసం గాయనీగాయకులు గా తెరమీదికి వచ్చి మరీ డబ్బులు ఇచ్చి పాట లు పాడి మానసిక ఆనందాన్ని పొందుతున్నట్లు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఏమిటంటే ఓ కళాసంస్థ అధినేత కోట్లు అప్పులు చేసి వేల కార్యక్రమాలు చేసి కలకోసం తమ జీవితాలనే త్యాగం చేశామని గొప్పులు చెప్పుకుంటూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందానా ఓ వైపు నిలువు దోపిడీ చేస్తూ అవార్డులు, సత్కారాలు అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉక్కుమహిళ అని చప్పట్లు కొట్టించుకుంటూ ఉన్నారనే విమర్శలు లేకపోలేదు.ఈ వ్యవహారం వెనుక ఓ గాన గంధర్వుడు కూడా ఉన్నాడట. ఇదంతా చూస్తున్న కళామతల్లి బిడ్డలు కన్నీరు మున్నీరవుతున్నారు.