బెంగళూరులో ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు, మోడల్స్ పట్టుబడినట్టు వార్తలు వచ్చాయి.అంతేకాదు, రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు రేవ్ పార్టీ నుంచి వెలుపలికి తీసుకువచ్చిన వ్యక్తుల్లో శ్రీకాంత్ పోలికలతో ఓ వ్యక్తి ఉన్నట్టు ఓ వీడియో ఫుటేజిలో కనిపిస్తోంది. దీనిపై శ్రీకాంత్ స్పందించారు. తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తాను హైదరాబాదులోనే ఉన్నానని, బెంగళూరు వెళ్లలేదని తెలిపారు. కన్నడ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అని పేర్కొన్నారు.