బకాయిలు కోట్లలో…బడాబాబులకు తప్పని చీవాట్లు
అంధకారంలో అక్షరాలు..
అన్నీ బడాయి మాటలు…ఆ వెనుక కుట్రలు
అన్నీ ఆంక్షలే…ఆచరణలో అన్నీ కాంక్షలే..
ఆశయాలు అబ్బో అనేటట్లు.. అమలు మాత్రం అబ్బే అన్నట్లుగా…
అది అందరిదీ …కానీ పెత్తనం కొందరిదే ..
శాలువా సన్మాలు సూపర్… సంక్షేమం మాత్రం తూచ్…
చచ్చినోడికి లేదు కనీస పలక రింపు…
అడిగినోడికి బెదిరింపులు…
అన్యాయం కదా అంటే అంతా మా ఇష్టం మంటే…
బెజవాడ లోనే ఇంత భావదారిద్యం
ఇక్కడేమైన నియంతలు ఉన్నారా…
ఇక్కడ వారిదే శాసనమా..
టీ సిగరెట్లకే లక్షలు ఖర్చు చేయొచ్చుట…
జర్నలిస్ట్ సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారా…
ఏమిటీ ఖర్మ.. ఎందుకింత దౌర్భాగ్యం ..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం నాలుగో స్తంభం జర్నలిజం. ఏ వ్యవస్థకు లేని విలువ గౌరవం ఒక్క జర్నలిజంకే ఉంది.మిగిలిన వ్యవస్థలు పనికిరాని వి కాదని పెడ అర్థం తీస్తే తప్పవుతుంది.అలాంటి ఉన్నత విలువలు కలిగిన జర్నలిజం వ్యవస్థ రోజు రోజుకు దిగజారి పోతుందంటే దానికి కారణం ఎవరు.ఈ వ్యవస్థ లో ఉన్న కొంత మంది స్వార్ధ పరులు కాదా..ప్రజాస్వామ్యం లో ఇంకొకరిని వేలెత్తి చూపే ముందు మన వీపు మనము చూసుకోవాలన్న చిత్తశుద్ధి ఎందుకు లోపిస్తుంది. జర్నలిజానికే ఏలుబడి అవుతుందని కాటికీ కాలు చాపే వయస్సులో కూడా నడవడానికి వీలు లేకున్నా, మాటలాడినికి ఓపిక లేకున్నా press అనే ఐదు అక్షరాలు అన్ని వాహనాలపై రాసుకుని ఏలుబడి సాగిస్తున్న ఈ పెద్దలు తమ అవినీతి చాపకింద నీరులా ప్రాకుతుందనే విషయాన్ని నర్మగర్భంగా ఉంచడానికి గల కారణాలు ఏమిటో వారికయిన అర్థమవుతున్నాయా లేదో మరి.ఒక నాడు కలం కున్న పదును చూసి ఖంగుతిన్న కాకలు తీరిన వీరులు కూడా తమ అవినీతిని కట్టడి చేసుకునే వారు.జీర్ణించుకోలేక ప్రాణాలు తీసేవారు.ఇవన్నీ గతంలో ఉండేవి.వర్తమానం లో భిన్న మైన పరిస్థితి దాపురించడానికి వ్యవస్థలో ఉన్న అవినీతిని ప్రశ్నించాల్సిన ‘ కలం ‘ అవినీతికే అండగా ఉండడమే.కాక పోతే మరేమంటారు.ఇతరుల మూలలను వెలికి తీసే సత్తా ఉన్న జర్నలిజం పూట పూటకు కూటికోసం అడుక్కుతినే స్థాయికి దిగజారి పోయింది. వీటిని కట్టడి చేయాల్సిన జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారై సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ ఎంతో హుందాగా నడుస్తుంది.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉన్న సదుపాయాలు సూపర్ గా ఉంటాయి.కానీ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ కి విజయవాడ ప్రెస్ క్లబ్ ఆ స్థాయికి ఎదగాల్సిఉంది కానీ ఒక జిల్లా స్థాయి ప్రెస్ క్లబ్ కంటే దారుణంగా ఉండటం ఇక్కడి జర్నలిస్టు నేతల తీరా లేక ఇంకేమైనా ఉందా అన్న పరిస్థితి దాపురించింది. ఇప్పటికే జర్నలిస్టులంటే బిక్షగాళ్ల కంటే అద్వాన్నంగా చూస్తున్న పరిస్థితి. గత ఐదు సంవత్సరాలలో ఆయితే జగన్మోహన్ రెడ్డి బిక్షగాళ్లకంటే దారుణంగా చూసారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏలుబడి సాగించిన పెద్దలే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలుబడి సాగించారు.అయితే ఆ ఏలుబడి తమ సొంతానికే పరిమితం అయ్యింది.ఇదంతా ఓ విధమైతే ఇప్పటికే అనేక నేరరమయ సంఘటనలలో భాగస్వామ్యం అయ్యి అరెస్టులు,ఆరోపణలు ఎదుర్కొంటూ విలువలు దిగజార్చుకుని జీవించడానికి సిద్దమైన జర్నలిస్టులను కట్టడి చేసి మంచి నడవడికలో నడిపించాల్సిన జర్నలిస్టుసంఘం నేతలు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొవడం సిగ్గు చేటు.అదికూడా సాటి జర్నలిస్టుల నుంచి.గతంలో గాని వర్తమానం లో దారి దోపిడీ దొంగలు,ఆఖరికి బిక్షగాళ్ల కు కూడా ఐకముత్యంతో ఉండి వారు వారు పొట్లాడుకున్న ఇతరుల ప్రమేయము లేకుండా చూసుకొంటారు.కానీ ఒక్క జర్నలిస్టుల లోనే ఐకమత్యం లేక చివరికి టీ సిగరెట్ల పేరుతో ప్రెస్ క్లబ్ పేరుతో దోచుకుంటున్నారని ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నాయంటే ఈ పరిస్థితి దాపురించడానికి గల వ్యక్తులు అది ఎవరైనా ఎంతటివారైనా సిగ్గుతో తలదించుకోవాలి.ఎప్పుడో స్థాపించిన ప్రెస్ క్లబ్ లో రోజు వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతో కొంత ఆదాయం లేకుండా పోలేదు అయిన జలవనరుల శాఖకు కోటీ ఎనబై లక్షల బకాయిలు ఉన్నాయని నోటీసులు మున్సిపల్ నోటీసులు నీటి పన్నులు ఇలా ఒక్క రూపాయి చెల్లించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ సన్మాలు సత్కరించటం చేసుకుంటూ ప్రెస్ క్లబ్,యనియన్ నాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారీలో రాజకీయాలు చేయడం కోసమే తప్ప ఒక జర్నలిస్టు ఛస్తే పూల దండ వేయలేని వారు కరోనా కేజీ బియ్యం ఇవ్వలేని వారు బుడమేరు వరదల్లో ఒక కుటుంబానికి అండగా ఉండిన దాఖలాలు లేవు.కానీ ఫొటోలు కోసం ఉనికి కోసం విరాళాలు ఇవ్వడం మాత్రం చూస్తే వీరి సంక్షేమం ఎలాంటిదో అర్ధమవుతుంది.సంక్షేమం అని చెప్పే ముందు అది చేయకపోయినా పర్వాలేదు కానీ సంక్షోభంలో ఉంచితే వీరేనా జర్నలిస్టుల సంక్షేమ వారధి అన్న అనుమానం కలుగుతోంది.శాసించే స్థాయి యాచించే స్థాయికి తీసుకవస్తున్న ఇలాంటి వారికి నిజమైన జర్నలిస్టులు గట్టి బుద్ది చెప్పకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారితుందనేది సత్యం.ప్రభుత్వాలు కూడా నిజ నిర్దారణ కమిటీ వేసి చర్యలు చేపట్టకపోతే రాబోవు రోజుల్లో జర్నలిజం ఇంకా మసకబారిపోతుంది.