అహో వీరి అవినీతి తగలెయ్యా…
వీరు బ్రతికిందంతా అవినీతి తోనేనా…
సిగ్గులేదా ఈ విధానాలకు..
ఇందుకేనా మీకు ఉన్నత పదవులు…
ఉన్నతంగా దోచుకోవడాని కేనా మీరున్నది..
ఏసీపీ అంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ అనే గా. .
అప్పనంగా క్యాష్ కోసం పదవులు అని రాదు గా..
ఎందుకయ్యా మీకు గౌరవ హోదాలు..
ఏమి వెలగ బెట్టారని మీకు సన్మానాలు…
అవినీతిలో ఎంత మెక్కేసారో పోటీ కోసమా…
కార్యాలయం ప్రక్కన ఉన్నది కూడా అక్రమము చేస్తావా ..
కార్పొరేషన్ చేష్టలుడిగి ఉందా…
చంద్రబాబు మీకు తప్పదు ఈ అవినీతి మసక….
దోచుకున్నారు…దాచుకున్నారు…దర్జాగా ఇంటికి వెళ్లారు…
ఇలాంటి అధికారులను దారిలో పెట్టేదెవరు ..
ఇక ఈ వ్యవస్థను గాడిలో పెట్టేదెవరు…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“ఏ దేశమేగినా ఎందు కాలెడినాఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలపరా నీ జాతి నిండు గౌరవము.ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో జనియించినవాడ నీ స్వర్గఖండమున ఏ మంచి పూవులన్ ప్రేమించినావో నినుమోసె ఈ తల్లి కనక గర్భమునలేదురా ఇటువంటి భూదేవి యెందు లేదురా మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల ఝండాలు ఆడునందాకఅవమానమేలరా ? అనుమానమేలరా ?భారతేయుడనంచు భక్తితో పాడ”అని రాయప్రోలు సుబ్బారావు రాసిన గేయాన్ని గుర్తు చేసుకుంటే…ఏబిల్డింగ్ చూసిన అక్రమమే… ఏ చోట పని చేసిన అక్రమాలు ప్రోత్సహించడం తప్ప ఇంకేముంది.కార్యాలయం ప్రక్కన బహుళ అంతస్తు ఉన్నా అది అక్రమమే అయ్యే జగదీశా..ఏమున్నది మనము చేసిన గొప్ప పనులు అంటే రాష్ట్ర మున్సిపల్ శాఖ పరిధిలో విజిలెన్స్ నివేదికలను చూస్తే అర్ధమవుతుంది.
ఈ పుడమిపై పుట్టినందుకు ఎంతో కొంత మేలు చేయాలి అలా చేయక పోయిన పర్వాలేదు జగదీశా తప్పుడు పనులు చేసి తమ స్వార్థం చూసుకోవడం ఎంతవరకు జగదీశా ఆలోచించక పోతివి.
బెజవాడ కార్పొరేషన్ లో ఏసీపీ అంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ స్థాయిలో ఉండి నీ అసిస్టెంట్ లు తప్పు అన్నా నీవు ఒప్పు చేసి అందుకు తప్పుదారిలో దండుకోవడం ఎంతవరకు సమంజసం జగదీశా…అయ్యా జగదీశా హాయిగా రిటైర్మెంట్ తీసుకున్నావు..నీ పదవికాలములో ప్రజల రక్తాన్ని జలగల్లాగా జీతాలు రూపంలో దోచుకున్నారు…మళ్లీ తప్పుడు పనులు చేసి అక్రమ నిర్మాణాలు కు అండగా నిలిచి అడ్డంగా దోచుకున్నావు.ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు అని అడిగేవారు లేక పోయారు..అలా అడిగి నిన్ను సమాజంలో కడిగి పారేస్తే నీ సమాధానం ఏముంటుంది దొరగారు.చీ మనది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల కోసమే పని చేస్తున్నామని పనికిమాలిన మాటలు చెపుకోవడమే తప్ప ప్రజా ఉపయోగకరమైన పనులు ఎన్ని చేసామో ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది గా ఓ అవినీతి పెద్దమనిషి. బెజవాడ లో మీ అవినీతి ఆటలు చుసి బందరుకు పంపిస్తే పుట్టింటికి రా చెల్లి అన్న చందంగా వెళ్లిన రెండు సంవత్సరాలకే బెజవాడ కార్పొరేషన్ కు వచ్చి సర్కిల్ 2 లో చేరి సరియైన విధానాలు పాటిస్తూ కింది స్థాయి ఉద్యోగులను నడిపించాల్సింది పోయి నీకు నచ్చకపోతే లేని పోని మాటలు చెప్పి రాసిరంపాన బెడితివి రూపాయి మూట కట్టుకుంటివి. కనీసం ఏదో చివర ప్రాంతంలో మన కక్కుర్తి పనులు ఉన్నాయి లే ఏ అధికారి మెయిన్ రోడ్డు లోనే చూడడు మన అవినీతి వల్ల శివారు నిర్మాణం ఇంకేముంది లే అనుకోవచ్చు.అవినీతికి కూడా హద్దుల్లేకుండా పోయింది. గతప్రభుత్వ విధానాలు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అలుసు అనుకోవాలో లేక ఆయన పార్టీ సభ్యులపై ఉన్న ప్రేమనో తెలియదు కానీ మెజార్టీ సభ్యులు వైసీపీ వారే కావడం వారు ఆడిందే ఆట పాడిందే పాట కావడంతో అక్రమ నిర్మాణాలకు అవినీతి అధికారులకు కోదవే లేకుండా పోయిందని ఘంటా పథంగా చెప్పాల్సిందే. బెజవాడ సత్యనారాయణపురం సర్కిల్ 2 లో చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలు అన్నీ ఇన్నీ కావు.ఇందుకేనేమో బహుశా అప్పటి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వ్యతిరేకంగా తిరిగి అప్పటి మంత్రి వెల్లంపల్లి కి జై కొట్టింది.అక్రమ నిర్మాణాల విషయంలో కార్పొరేటర్లకు వాటాలు ఇవ్వలేదన్న ప్రచారం బాగా జరిగింది అప్పట్లో. ఓహో ఇందుకే కాబోలు డిప్యూటీ మేయర్ శ్రీవారు ఎన్నికల మందు ఓ బీల్డింగ్ విషయం అదికూడా బీసెంట్ రోడ్ లో టీ అమ్ముకునే వ్యక్తి అంటూ వెనుకేసుకొచ్చి అక్రమ దారులకు అండగా నిలిచింది.ఇందులో ఇంకొక ఘనకార్యం ఉంది.. అయ్యా ఈ బిల్డింగ్ అక్రమము అని కార్పొరేషన్ కు పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు ఈ అవినీతి అధికారులకు ఫార్వార్డ్ చేస్తారు.ఈ నీతి లేని అధికారులు ఇచ్చిన ప్లాన్,వివరాలు ఇచ్చి మీ పిర్యాదు క్లోజ్ అయిందని మెసేజ్ వస్తుంది. దీనివల్ల ఎవరికి ఉపయోగమో అర్థం కానీ పరిస్థితి. కమిషనర్ కు కాళీ లేక పోయే సిటీ ప్లానర్ చల్లగా కూర్చుని పచ్చకాగితాలు సరి చేసుకుంటుంటే ఈ అవినీతి అధికారుల లీలలు అనంత మై నప్పుడు అతున్నత స్థాయి అధికారులు విచారణ జరిపి చర్యలు ఇచ్చిన ఆ చర్యలు ఏమాత్రం మార్పు తెస్తాయంటే అవి ఆరంభ సూత్రం తప్ప పటిష్టమైన చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోతుంది. సీతారాంపురం బీల్డింగ్ విషయంలో కానీ సర్కిల్ 2 కార్యాలయం ప్రక్కనే ఉన్న నిర్మాణాలను పరిశీలిస్తే ఈ అవినీతి అధికారుల భాగోతం బట్టబయలు అవుతుంది.కొత్త కమిషనర్,విజిలెన్స్ అధికారులు ఓ సారి ఈ నీతిలేని అధికారులు చేసిన అవినీతి పనులపై అరా తీస్తే భవిష్యత్ అధికారులైన కొంత మేర సక్రమంగా పనిచేస్తారని ఆశించే ప్రయోజనం ఉంటుంది.