గొల్లపాలెం పిహెచ్సి అధికారి సౌజన్య.
రామచంద్రపురం :జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బాగంగా శలపాక గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో 327 మందికి పలు రకాల వైద్య సేవలందించా మని గొల్లపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాకారిణి డాక్టర్ యన్.సౌజన్య తెలిపారు. ఈమేరకు శుక్రవారం కాజులూరు మండలం శలపాకగ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష
కార్యక్రమములో భాగముగా చివాలయంలో నిర్వహించారు.ఈ ఆరోగ్య శిబిరములో రోగులకు వివిధ రకములైన వ్యాధి నిర్ధారణ పరిక్షలు, రక్త, నీరుడు, వివిధ రకములయిన జ్వరముల దీక్షలు, ఈసిజి, రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించి, రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు.
ఈ వైద్య శిబిరములో పిహెచ్ సి చెందిన వైద్యులతో పాటు మరో ముగ్గురు ప్రత్యేక వైద్యులు, నేత్ర సంబదిత ఇతర దీర్గకాలిక సంబదిత వ్యాదులు ఉన్న రోగులకు చికిత్స అందజేసారని తెలిపారు. కాగా శిబిరానికి హజరైన ముగ్గురుని మెరుగైన వైద్య సేవల నిమిత్తం రిఫర్ చెయ్యడం జరిగిందని డాక్టర్ సౌజన్య తెలిపారు. ఈశిబిరంలో డాక్టర్ శ్రేయ, గొల్లపాలెం పిహెచ్ సి ఏఎన్ ఎమ్ లు ,సిబ్బంది తదితరులు సేవలందించారు.
