భారత యువ క్రికెటర్ జితేశ్ శర్మ పెళ్లి చేసుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన జితేశ్ శుక్రవారం ఓ ఇంటివాడయ్యాడు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన షలక ముకేశ్వర్‌ను పెళ్లాడాడు. కేవలం ఇరువురి కుటుంబాలు మాత్రమే ఈ వేడుకకు హజరయ్యాయి. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా వీరి పరిణయం జరిగింది.తమ పెళ్లి వేడుక ఫొటోలను జితేశ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ క్రేజీ ప్రపంచంలో 8.8.8న మనం ఒకరికొకరం దొరికాం’ అంటూ ఆ ఫొటోలకు జితేశ్ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో ఈ నూతన వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండ్ శివం దూబేలతో పాటు పలువురు క్రికెటర్లు జితేశ్ దంపతులకు విషెస్ తెలిపారు.