వి.ఆర్.పురం
చింతరేగుపల్లి గ్రామానికి చెందిన సవలం శారద చనిపోయినారు, ఆమె కుటుంబానికి జమాల్ ఖాన్ ట్రస్ట్ సభ్యులు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు అయిన కోట్ల బాలయ్య మాట్లాడుతూ చనిపోయిన శారద కు జె కె సి టి ట్రస్ట్ ద్వారా సహాయం చెయ్యడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. వారికి చేసిన సహాయంకు జామల్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలజేస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్ఫరాజ్, ముత్యాల రామారావు, శంకర్, కోట్ల బాలయ్య, బాగుల మరిడి వెంకట రమణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.