- తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి 200 మంది వైఎస్ఆర్సీపీ లో చేరిక
- సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి
- పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలిచే మనస్తత్వం
- అందుకే టిడిపి వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాం..
- రణధీర్ పురం పంచాయతీ మాజీ ఎంపీటీసీ రేణుక గురుమూర్తి
చంద్రగిరి:చంద్రగిరి నియోజకవర్గ పరిధి లోని,తిరుపతి అర్బన్ మండలం రణధీర్ పురం పంచాయతీలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టిడిపి నుంచి మాజీ ఎంపీటీసీ రేణుక గురుమూర్తితో పాటు ఏకంగా 200 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో వైకాపా పార్టీ కండువాలు కప్పుకున్నారు. జై జగన్, జై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జై మోహిత్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నాం.. అండగా నిలుస్తూ.. ఆపదలో ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నట్లు తెలియజేశారు. రణధీర్ పురం గ్రామ పంచాయతీలో రూ.7 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగేందుకు మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలిచే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లు సజావుగా ప్రజాపాలన కు సంకల్పిస్తారని మాజీ ఎంపీటీసీ రేణుక గురుమూర్తి తెలిపారు. సమర్థవంతమైన నాయకుల వెంట నడిచేందుకు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరమని తెలిపారు. పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు నచ్చాయన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధికి కాబోయే ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలిసి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జ్ పీఎం లక్ష్మీనారాయణ, సప్తగిరి కాలనీ పార్టీ ఇంచార్జ్ అశోక్ కుమార్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు షేక్ రజాక్, సప్తగిరి కాలనీ అధ్యక్షులు మహమ్మద్ ఖాసిం, ఉప సర్పంచ్ మల్లెమొగ్గలు ఉమాపతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.