వీర్ల శ్రీరామ్ యాదవ్,
గణపతిరావు పొలమర శెట్టి
ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం
విజయవాడ

దశాబ్దాల కాలంగా నానా అగచాట్లు పడు తున్న పాత్రికేయుల జీవితాల్లో మార్పులు రావడం లేదని, వారి వెతలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు సీనియర్ జర్నలిస్టులు వీర్ల శ్రీరామ్ యాదవ్, గణపతిరావు పొలమ ర శెట్టి అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సంపాదకుల సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీరామ్ యాదవ్, గణపతిరావు ను పాత్రికేయులు సత్కరించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా రంగం ముఖ్యంగా చిన్న పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను సోదాహరణంగా వివరించారు. ఈ దుస్థితిని నిలువరించాలంటే ప్రభుత్వాలు సత్వరం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పత్రికా సంపాదకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూర్మా ప్రసాదవాబు, ప్రధాన కార్యదర్శి ఏ రామమోహన్ రెడ్డి, ఏపి ఎంపీ ఏ నాయకులు నాగోతి శ్రీనివాసరావు, మన్మధ రావు, రాజా, పెద్దిబియిన శ్రీనివాసరావు,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


