న్యూఢిల్లీ:భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో నూతన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది మే 13 వరకూ ఈయన పదవిలో కొనసాగనున్నారు.