పోరుమామిళ్ల:
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ అన్వర్ ను కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది . ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, మైనారిటీల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్ పార్టీనే అని , పార్టీ కోసం కష్టపడినందుకు తనకు తగిన గుర్తింపు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన ,పిసిసి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ షర్మిలకి, పీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డికి, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు దాదా గాంధీకి, జిల్లా అధ్యక్షులు శ్రీరాములుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లాలో మైనారిటీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.