డిసిసి బ్యాంక్ మేనేజర్ ఉమామహేశ్వరి
ఒంటిమిట్ట:
కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వారి ఆధ్వర్యంలో.డి సి సి,బ్యాంక్ సిద్ధవటం పరిధిలోగల ఒంటిమిట్ట. పాక్స్.ఒంటిమిట్ట బస్టాండ్ సెంటర్ నందు బుధవారం నాడు ఉమామహేశ్వరి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ వారు బ్యాంకు నందు గల వివిధ పథకాల గురించి కళాజాత పరిస్థితుల ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన మరియు బ్యాంకు డిపాజిట్ వ్యవసాయ రుణాలు పొదుపు సంఘాల రుణాలు అకౌంట్స్ డిజిటల్ లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ రూపే కార్డు సౌకర్యం వివిధ పథకాల పైన కళాజాత బృందం వారు మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్స్ ద్వారా గ్రామ ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. కడప జిల్లా సహకార బ్యాంకు సిద్ధవటం మేనేజర్ మేడం గారు. పి ఎ సి ఎస్, సీఈఓ గారు బ్యాంకు సిబ్బంది శ్రీ ఉమామహేశ్వరి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత బృందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
