పారుపల్లి నవీన్ కోటనందూరు
కమతమల్లవరం… అప్పట్లో కాంగ్రెస్ కు కరుడుగట్టిన గ్రామమది.పెత్తందార్ల గుప్పెట్లో గంపగుత్తగా కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కురిపించేవారూ ఈ గ్రామస్తులు.ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు నాటి పరిస్థితి.పెత్తందార్లను ఎదిరించే దమ్మున్న నేత ఎవరూ ముందుకు రాకపోవడంతో అప్పటి వరకు కాంగ్రెస్ కు ఎదురు లేకుండా పోయింది.అప్పడే అభివృద్ది తాంత్రికుడు మెరుపుతీగలా గ్రామంలో అడుగు పెట్టారు.ఆయనే యనమల రామకృష్ణుడు.1983లో తొలిసారి ఎన్టీఆర్ పిలుపుఅందుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి యనమల రామకృష్ణుడు ఈ గ్రామానికి ఎన్నికల శంఖారావం పూరించేందుకు వచ్చారు.అప్పటివరకు గుమ్మనంగా ఉన్న ప్రజల్లో ఉత్సాహం ఉరకలేసింది.ప్రజాచైతన్యం వెల్లివిరిసింది.
ఆ ఎన్నికల్లో పెత్తందార్లు మాట చెల్లుబాటు కాలేదు.గంపగుత్తుగా యనమలకు ఓట్ల వర్షం కురిపించారు.తనపై గ్రామస్తులు చూపించిన మమతానురాగాలకు ఎవరు అడిగినా అడగకపోయినా యనమల రామకృష్ణుడు గ్రామాభివృద్ధికి గట్టి పునాదులు పరిచారు.ఆ తర్వాత కాలంలో గాడి రాజబాబు రాజకీయ ఆరంగేట్రం చేశారు.తెలుగు దేశంలో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.యనమల సోదరులతో జోడి కట్టిన రాజబాబు గ్రామాన్ని టీడీపీకి పెట్టని కోటగా తీర్చిదిద్దారు.అప్పట్నుంచీ ఇప్పటి వరకు కమత మల్లవరం తెలుగుదేశం దేశం పార్టీకి కమత మల్లవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచింది. యనమల రామకృష్ణుడు శాసనసభ్యుడిగా గెలుపొందడంతో కమత మల్లవరం రూపురేఖలే మారిపోయాయి.కాకలుదీరిన పెత్తందారులను జడవకుండా తన వెంట అడుగులు కలిపిన కమత మల్లవరం ప్రజలు బ్రిటిష్ కాలం నుంచి ఎదురవుతున్న కష్టాలను తన అభివృద్ధి జపంతో యనమల రామకృష్ణుడు కడతేర్చారు.1985లో బాడవ గెడ్డపై వంతెనకు పునాది రాయి వేసిన యనమల వెనువెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించి ప్రజాభీష్టాన్ని నెరవేర్చారు.ఇక్కడ నిర్మించిన బ్రిడ్జి పడడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను ఇళ్లకు తరలించేందుకు మార్గం సుగమం అయింది. ఇక అప్పటినుంచి గ్రామ అభివృద్ధి పుంతలు తొక్కింది.యనమల కృషి ఫలితంగా శాశ్వత పథకాలతో పాటు మౌళిక సదుపాయాలు ఏర్పరచుకొని అభివృద్ధి అంటే ఇదేనయ్యా చూపించారు.దీంతో అప్పటి కమ్ముకున్న కాంగ్రెస్ ఛాయలు పటాపంచలైయ్యాయి.అంతా ఏకతాటిపై తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచారు.ఇక నిరుపేద లకు స్వగృహయోగం కల్పించిన రామకృష్ణుడు ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళారు.వీధి,వీధికి సిమెంట్ రోడ్లు, పక్కా డ్రైన్లు నిర్మించారు.అలాగే ప్రధాన కూడళ్లలో సోలార్ విద్యుత్ దీపాలు కమత మల్లవరాన్ని దేదీప్యమానం చేస్తున్నాయి.శిధిలావస్ధలో ఉన్న రామాలయాన్ని యనమల సహకారంతో నూతన రామాలయాన్ని పునర్నిర్మించుకున్నారు.ప్రజల త్రాగునీటి అవసరాలను గుర్తించి రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేయించిన అభివృద్ధి తాంత్రికుడు యనమల.. ఎన్టీఆర్ జలస్రవంతి మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు.అన్నదాతలకు ఎన్టీఆర్ జాలేసింది పధకం క్రింద సోలార్ పంపు సెట్లు మంజూరు చేయించిన రైతు బాంధవుడు యనమల రామకృష్ణుడు.అలాగే పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు గ్రామానికి సమకూరాయి.శ్మశాన వాటిక వద్ద మౌళిక వసతులు,సిమెంట్ రోడ్డు ఏర్పాటయింది.ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ప్రజలు రేపటి ఎన్నికల్లో యనమల దివ్య కు తిరుగులేని మెజారిటీ అందిస్తామంటున్నారు