Wednesday, March 19, 2025

Creating liberating content

రాజకీయాలుపరువు పోయిందట..

పరువు పోయిందట..

పాడు పనులు చేసి నప్పుడు పరువు పోలేదా..
అన్నదానం అంటూ ఆరు లక్షలు దోచేస్తే..
ఆరు లక్షలు ఇవ్వలేదని అబద్ధపు కూతలు కూస్తావా..
ఆడ పిల్లలకు అన్యాయం చేసిన అగుపించ లేదా..
బ్యాంక్ లావాదేవీలు చూస్తే మీ బ్రతుకు బట్టబైలు కాదంటావా..
ఐదు వేలు ఇమ్మని ఆ అధికారిని బ్రతి మాలుకొన్నప్పుడు ఏమయింది..
బ్రతికిఉన్నప్పుడు పత్తాలేనప్పుడు చచ్చాక ప్రేమ పుట్టుకోచ్చిందా..
తప్పుడు పనులు చేసి తాగి చస్తే తప్పెవరిది ..
ఓరీ నీ బ్రతుకులు చెడ..చట్టం నీ చుట్టం కాదుగా ..
ఎవరో ఏదో చెబితే బౌన్సర్లను పెట్టుకుంటే..
ఆ గడ్డపై అడిగితే నీ గబ్బు తెలుస్తుంది..
కారుకూతలు కుసావ్ …ఆ కనక దుర్గమ్మ చూస్తుంది లే ..
నీ బ్రతుకొక నటన..నీ వెనుక ఉన్నది ఓ దుర్ఘటన..
మీ దుర్మార్గం పండక తప్పదు..
కర్మ ఎవరినీ వదలదు లే..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
పరువు గురించి పనికిమాలిన వారు కూడా మాట్లాడితే ఫక్కున నవ్వుతోంది ప్రజానీకం. పాపపు పనులు చేసి ఎందరి జీవితాల్లోనూ పొర పెచ్చులు తెచ్చి పబ్బం గడుపుకుని చివరికి పాడు చావు చచ్చిన పరువు పోయిందని పరువు అంటే కూడా తెలియని పోరంబోకు కూడా మాట్లాడుతుంటే పరువుకే పరువు పోయేలా ఉందని చెప్పాలి. సమాజంలో తనకు ఉన్న ఒక కళను చూపించి అందరి కళ్ళల్లో కారం కొట్టి ఎన్నో కొట్లాటలు పెట్టి మరెన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తే చివరికి కనకదుర్గమ్మ కరుణించక పొగా కన్నెర్ర చేస్తే కంఠం లో ప్రాణం పోతుంటే కాసుల కోసం కక్కుర్తి పడి నేడు పరువు పోయినది ప్రాకులాడుతున్నట్లు పుకార్లు షికార్లు చేయిస్తే నీ పరువు ఇంకా దిగజారి పోతుందేమో కానీ ప్రజల్లో నీవు చేసిన చేస్తున్న నీకు సహకరిస్తున్న పాడు మనుషులకు కూడా పెద్ద శిక్ష పడకపోతుందా అని ఆ ప్రజలే ఆలోచన చేస్తున్నారు.
అతనొక సంఘస్కర్త అని సందు గొందుల్లో చేసిన చెండాలం పనులు ఛీత్కారాలు పుట్టిస్తుంటే పుట్టిన బిడ్డపై కూడా పుకార్లు పుట్టిస్తానని పూటకో పాడు పనులుచేస్తుంటే పై వాడు కూడా ఈ పాపపు పనులు చూసి పెద్ద శిక్ష వేసినా బుద్ది రాని వీరికి పరువు పోతుందట ..ఆ పరువు పోకుండా చూడాలని ప్రాకులడుతూ ఉంటే ప్రజా జీవితంలో ఇంతకంటే నీచం ఏముంటదని ఎర్రి సమాజం ఎదురు చూస్తూ ఉంది. వావి వరుసలు లేకుండా తిరిగి ఎందరినో అమ్మా అంటూ అందిన కాడికి దోచుకుని తింటే ఆ కుటుంబాలు అల్లాడి పోతున్నాయి.ఇవన్నీ మరిచి అతగాడి ఆశయాలును కొనసాగించడానికి బయలు దేరిన బడుద్దాయి బడా బాబులు పేరు చెప్పి బోలెడు రూపాయిలు ఆశించి భంగపాటు కు గురైతే ఏమయింది రా అయ్యా మీ పరువు. సత్యాన్ని మరిచి అసత్యపు మాటలు మాట్లాడుతుంటే ఆ అధికారే చెప్పిన వినక పోగా అక్కడ ఉండి ఇక్కడ ఏదో చేయాలని చూస్తే అన్యాయం అన్నది ఎక్కడున్నా అడ్రెస్ వెతుక్కుని మరీ వచ్చి సరైన అపరాధం వేయక పోదా అని ఆలోచన చేస్తుంది అక్కడి ఇక్కడి సమాజం. లేని ఆరోపణలు సృష్టించి అవమానకర పనులు చేయడానికి అమాయకులను రెచ్చగొట్టి అల్లరి పాలు చేయాలని చూసి కూడా అంతుచిక్కదు లే అని అమాయకంగా ఆటలు ఆడితే ఆలస్యంగా నైన తగిన అపరాధం చెల్లించక తప్పదు రా తప్పుడు నాయనా…నీ తడబాటు చూసి ఎవరో తంతారని చెబితే ఎక్కడ తంతారోనని నీవు బడిన తడబాటు తెలియదని అనుకున్నవా.
ఓ వైపు అర్ధ రూపాయి లేదని తెలుసు అడుక్కొని అబద్దాలు చెప్పి అమాయకుల దగ్గర అప్పనంగా దోచుకుని అడ్రస్ లేని అతి పెద్ద పార్టీ పేరు చెప్పి అందరిని మాయ జేసీ ఆఖరికి చితికి చేరబోయే సమయంలో ఆరు లక్షలు ఇవ్వమని అడిగితే ఆరు లక్షలు తెచ్చేలోపే ఆ అమ్మవారు అనుగ్రహించక పోతే అది దృష్టిలో పెట్టుకుని అడ్డంగా వాగడం అధర్మమని తెలిసినా ఇంకా అన్యాయం కు దిగుతుంటే ఆలస్యం గా నైనా అన్నీ బైటికి వచ్చిన రోజు అప్పుడేమీ సమాధానం చెప్పాలో తెలియక పరువు ప్రతిష్ట అని పోసుపోని మాటలు మాట్లాడుతుంటే చివరికి పట్టించుకునే వారు లేక పడే పాట్లు ఆలోచిస్తే ఆవేదన కలుగుతోంది. అబద్దానికి అన్యాయానికి తాత్కాలిక ప్రయోజనం ఉంటుందేమో కానీ అది ఆశాస్వితం అన్నది కూడా ఆలోచన చేయాలి ఓ పరువు గల మనిషి. మనిషి ముగబోయిన మొబైల్ మాట్లాడుతూ మనిషి లేక పోయినా మని ట్రాన్స్ఫర్ అవుతుంటే ఇది చట్టం దృష్టిలో నేరం కాదా ఇంత కంటే పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా అని ఆలోచిస్తే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నర నరాన నిషాతో నింపుకుని నాయకుడు కావాలని నాటకమాడుతూ నడి వీధుల్లో నిస్సిగ్గుగా తిరుగుతూ చివరికి ఆ నిషా తోనే నిద్రాణం లోకి పోతే అది కూడా చెల్లి అనే చెలికి తెలిస్తే ఇన్నాళ్ల తరువాత తప్పుడు మాటలు మాట్లాడిన ఈ తప్పుల వెనుక అనేక మంది తప్పుడు ప్రోత్సాహించే వారున్నారని అనుకుంట తడబాటు తప్పదు తమ్ముడు నీకు..ఇక తాటాకు చప్పుడులతో బ్రతుకుదామని అనుకుంటే తాత్కాలిక ఆనందమే తప్ప తప్పులకు తప్పక శిక్ష పడుతుంది తమ్ముడు.. కర్మ ఎవరిని వదలదు…చూడాలి ఎవరి కర్మ ఎటు తగలడుతుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article