హాజరైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట

గోకవరం రోడ్డు వాసుదేవ నగర్ లో జగ్గంపేట నియోజకవర్గం లోని యాదవులు కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జగ్గంపేట నియోజకవర్గం లో గల యాదవులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో వన సమారాధన నిర్వహించి వన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, వైసీపీ యువ నాయకుడు తోటరాంజీ హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను వచ్చిన అతిథులందరిని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం నూతనంగా యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ లు నియమించిన పిఠాపురం నియోజకవర్గం కు చెందిన నక్క నారాయణమూర్తిని రాజానగరం నియోజవర్గం కు చెందిన బత్తుల నాగేశ్వర రావుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ నియోజవర్గంలోని యాదవ కులస్తులందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వన సమారాధన నిర్వహించుకోవడం దామోదరుడికి పూజలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని టిడిపి ప్రభుత్వం యాదవ కులస్తులను ఎప్పుడూ గౌరవిస్తూ ఉందని దానికి నిదర్శనం యనమల రామకృష్ణడుకి ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ఆయన కు వివిధ పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారంటే యాదవులను గౌరవించినట్టేనని ఎమ్మెల్యే అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం లో యాదవ కులస్తులకు ఒక ఎకరం స్థలంలో సామాజిక భవనం నిర్మిస్తానని విద్యా, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, యాదవ సంఘం ఆహ్వాన కమిటీ అడపా భరత్ బాబు, ఓమ్మి రఘురాం, మోరుకుర్తి రాజు, వైభోగుల కొండబాబు యాదవ్, రేఖ బుల్లి రాజు, సర్వసిద్ధి లక్ష్మణరావు, కొల్లు రామకృష్ణ, దారబల్ల సద్గురు మూర్తి, ముద్దాడ కుమార్, మరుకుర్తి గంగాధర్, రాజనాల సత్తిబాబు, కారుకొండ శ్రీను, కురందాసు కొండలరావు, పల్లా వీరబాబు, కొల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.