మహారాజ టీ20 ట్రోఫీలో భాగంగా మైసూర్ వారియర్స్, మంగళూరు డ్రాగన్స్ మధ్య మ్యాచ్
సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఊచకోత కోసిన కరుణ్ నాయర్
మహారాజ టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తన పక్షంలోకి తిప్పుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళూరు డ్రాగన్స్కు వ్యతిరేకంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కరుణ్ 43 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తం 48 బంతుల్లో 124 పరుగులు చేసి తన జట్టును ఒక బలమైన స్థితికి తీసుకెళ్లాడు.కరుణ్ నాయర్ ఈ ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 13 బౌండరీలు బాదాడు. 258.33 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మైసూర్ వారియర్స్ ఇన్నింగ్స్ మొదట నెమ్మదిగా సాగినప్పటికీ, కరుణ్ బాటింగ్‌లోకి రావడంతో స్కోరు వేగంగా పెరిగింది.వీరి దెబ్బకు మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు, మంగళూరు డ్రాగన్స్ ముందు 167 పరుగుల లక్ష్యం ఉంచబడింది.మంగళూరు డ్రాగన్స్లో వికెట్ కీపర్ సిద్ధార్థ్ 27 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించినా, మిగతా బ్యాటర్‌లు విఫలమయ్యారు. ఆ జట్టు 138 పరుగులకే పరిమితం కావడంతో, మైసూర్ వారియర్స్ 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.