తప్పుడు లెక్కలతో తప్పుడు పనులు
సమాచార అధికారులనే బురిడీ కొట్టిచ్చే ప్రయత్నం. .
చిన్న పత్రికలలో ఆశలు నింపిన ఆ ఇద్దరు అధికారులు..
వాస్తవాలు చూసి విస్తుపోయిన మహిళా అధికారి..
అమ్మో ఇదెంత అన్యాయమని ఆలోచనలో అధికార యంత్రాంగం..
అక్రమాలకు అడ్డుకట్ట వేయగలిగిన ఏపీఎస్ఎస్
సంపాదకుల శ్రేయస్సు పరమావదిగా..
చిన్న పత్రికల మనుగడే ముఖ్యంగా ముందడుగు ..
అధికారుల చొరవతో జీవం పోసుకొనున్న సంపాదకులు..
మంత్రి పార్థసారథి కి మొక్కాల్సిందే..
అందరి జీవితాల్లో కాంతి ని నింపిన జెడి కిరణ్..
ఆదర్శంగా నిలుస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ స్వర్ణలత..
అందరి మనస్సుల్లో హిమము కురిపించిన హిమాన్స్ శుక్లా ..
చంద్రబాబు కు జేజేలు పలుకుతున్న జర్నలిస్టులు..
లోకేష్ ను శభాష్ అంటున్న సంపాదకవర్గం..
కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆసలు నింపిన కూటమి సర్కార్…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
“అల్పుడెపుడు పల్కు నాడంబరముగానుసజ్జనుండుఁ బల్కుఁ జల్లగానుకంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునావిశ్వదాభిరామ వినురవేమ. నీచుడు డంబములు చెప్పుచుండును. మంచివారు మెల్లగా మాటలాడుచుందురు. తక్కువ ఖరీదైన లోహము అయిన కంచు దడదడమని మ్రోగునట్లు, యెక్కువ ఖరీదైన బంగారము అను లోహము మ్రోగదుకదా”వేషధారినెపుడు విశ్వసింపగరాదు…విశ్వదాభి రామ వినురవేమ”వేషధారినెపుడు విశ్వసింపగరాదువేషదోషములొక విధయె యగునురట్టుకాదె మునుపు రావణు వేషంబువిశ్వదాభిరామ వినురవేమ”ఇలా ఇంకెన్ని వేమన సుమతి శతకాలు చెప్పుకున్న ప్పటికి ఈ కసాయి వాడి లీలలు తెలియవు అందరికి.సాధారణంగా పాము మాత్రమే తన పిల్లలను తింటుందని సామేత ఉంది. కానీ ఇక్కడ ఒక కసాయి వేలాది మంది సంపాదకులను చావు దెబ్బకొట్టేలా చేసిన ప్రయత్నాలు అప్రయత్నంగా మారి పోయాయని చెప్పక తప్పని పరిస్థితి. కారణం తనకు ఉన్న మాటల గారడీ ,చావు తెలివితేటలు ,కొంత పాండిత్యం తో పాటు తనను ఎదురించడానికి ఎవరు కూడా సరైన విధానంలో ముందుకు పోలేక పోవడంతో తాను ఆడిందే ఆట పాడిందే పాట గా చెల్లుబాటు చేసుకున్నారు చెల్లుబాటు అయ్యినన్ని రోజులు. తాము కూడా ఓ పత్రిక నడుపుకుని సంపాదకునిగా చెలామణి అవుదామని ఎంతో మంది ఉన్నారు.అయితే నేడు రోజు రోజు కు పుట్టగొడుగుల్లా సంపాదకులు సంచరిస్తున్నారు నేటి ఆధునిక సమాజంలో.సంపాదకీయం అంటే సంపాదించుకోవడమే గా అబ్బో అదెంత పని అంటూ వస్తున్నారు చాలామంది.దాని లోతుకు పోతే ఆ లోతు చాలా ఉంటది.అయితే ఇటువంటి పరిస్థితుల్లో పత్రిక లు ఎక్కువ కావడంతో దీర్ఘకాలికంగా శాసిస్తున్న నాటి కురువృద్ధులు కి కొంత మింగున పడని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపద్యంలో 2024 -2026 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల కి నూతన అక్రిడేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సంకల్పించి సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేసాను సారం మంత్రి సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్స్ శుక్లా ఇతర అధికారులతో కలిపి సచివాలయ సమావేశ మందిరంలో చక్కటి విందు భోజనం పెట్టి చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ అందరి సలహాలు సూచనలని ఎంతో సౌమ్యంగా విని అందరికి సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. అయితే సమావేశం జరిగిన తదనంతర పరిణామాలు సోషియల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఒక జీవో ఈ రాష్ట్రంలో ని ఏ ఒక్క సంపాదకున్ని బ్రతిజించే విదంగా లేక పోగా చావే మార్గమని అన్న దోరణికి తెచ్చేలా చేసింది. అయితే ఆ జీవో అబద్ధమని నిరూపించే ప్రయత్నం లో రాష్ర్ట పత్రికా సంపాదకుల సంఘం ApSS అనేక విధాలుగా అధికారులతో సంప్రదింపులు జరిపి సంపాదక వర్గం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని స్వయాన ముఖ్యమంత్రి కార్యాలయం కు వినతి చేయడం జరిగింది. అయితే ఆ వినతులని ఆంధ్రప్రదేశ్ యూనియన్ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ApUWJ (ఇది ఆంద్రాది) పోరాటం కూడా తోడు కావడంతో ఎందుకింత రాద్ధాంతం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం విచారణ మొదలు పెట్టింది. ఈ విచారణ సౌమ్యుడు జర్నలిస్టుల పట్ణ సానుభూతి కలిగిన మంత్రి కొలుసు పార్థసారథి సంబందిత అధికారులకు సూచించడం తో సమాచార శాఖ లో బీస్మాచార్యుడు లాగా ఉన్న జెడి కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్ స్వర్ణలత లు అసలు ఈ సంఘాలు ఎప్పుడు పుట్టాయి వీటిలో ఏది ఎంత మంది సభ్యులు న్నారని ఆరా తీస్తే అమ్మో ఇదేమిటని నోరెళ్లబెట్టేంత పని అయింది. అయ్యయ్యో ఇంత కాలం ఇన్ని భ్రమల్లో ఉన్నామా మా కళ్ళకు కూడా గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారా అని అచ్చర్యపోయారు.ఇంత కాలం APSS పోరాటం చేసేది నిజమేనా అని ఆలోచన చేసి చిన్న పత్రిక ల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు..ఇలా చేస్తే కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా కళంకితం వస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం కు కిరణ్ సమగ్ర నివేదిక అందించి అక్రిడేషన్ విషయం లో అలమరికలు లేకుండా చూసి అందరి జీవితాల్లో క్రాంతి కిరణాలు నింపేలా తనవంతు ప్రయత్నం చేసాడు జెడి కిరణ్.దీనికి అనుగుణంగా మరో ఉన్నతాధికారి స్వర్ణలత అన్ని విధాలుగా పరిశీలించి అందరి సంపాదకులు ప్రయాణం సువర్ణభరితంగా ఉండేవిధంగా తన వంతు సూచనలు చేశారు. దీనితో అక్రిడేషన్ ల గడువః మరో మూడు నెలలు పొడిగింపు అయింది. అయితే ఈ పొడగింపు కొంతమేర ఇబ్బంది ఉన్నా బహుళ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి దార్శనికత కి యువమంత్రి లోకేష్ కట్టుబడీ ఉన్న మాటకి సమాచార శాఖ కు చెడ్డ పేరు తెస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదన్నా ఆ శాఖ సారథ్యం వహిస్తున్న సారధి అందరి మానస్సులో హిమము కూరిపించి కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా ఉండాలని డైరెక్టర్ హిమాన్స్ శుక్లా నూతన సంవత్సరం లోకూటమి ప్రభుత్వం కలానికి విలువ ఇచ్చి కాంతులు నింపేలా చక్కటి ప్రణాళికలు తయారు చేసి కొంగొత్త ఆశలతో కొత్త అక్రిడేషన్ లు ఇవ్వడానికి కాగితాలు రెడీ చేస్తున్నారని చెబుతూ కూటమి ప్రభుత్వం లో కుట్రలకు తావు లేదని మరో సారి ముఖ్యమంత్రి దార్శనికత ను నిరూపించబోతున్నారు అధికారులు. కావున గత ప్రభుత్వం లో కుట్రకు బలైన వారందరికి కూటమి ప్రభుత్వము లో కొంత మేర ఉపశమనం కలుగుతుందని ఆశిస్తూ కూటమి ప్రభుత్వానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు… కుట్రలు చేసేవారి కుట్రలు కుదేలు అయ్యాయని చెబుతూ కొత్త కార్డుల కోసం కొంత కాలం వేచిచూద్దాం..
You got a very good website, Gladiola I observed it through yahoo.