తెలంగాణ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్నప్పుడు కవితకు గైనిక్ సమస్యలచ్చాయి. అప్పట్లో ఆమె చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈరోజు ఆమె ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.