మండల అబివృద్ధి అధికారి రాంబాబు.
రామచంద్రపురం
కాజులూరు మండలాన్ని బాల్యవివాహాలు లేని మండలంగా చేయాలని కాజులూరు ఎంపీడీవో జె.రాంబాబు అదికారులకు సూచించారు.ఈమేరకు శుక్రవారం మండలస్థాయి బాల్యవివాహ నిరోధక కమిటీ , బాలల హక్కుల సంరక్షణ కమిటీ సంయుక్తంగా .
స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం సమావేశ మందిరంలో శిశు సంక్షేమ శాఖ, ఐ సి డి యస్ ప్రాజెక్ట్ తాళ్లరేవు,జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సి డి పి వో వి మాధవి ఆదేశాలు మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాంబాబు అధ్యక్షతన మండలస్థాయి బాల్యవివాహనిరోధక, పర్యవేక్షణ కమిటీ, బాలల హక్కులు , సంరక్షణ కమిటీ ,ప్రభుత్వం జారీచేసిన జీవో పై అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈసమావేశంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి రాంబాబు మాట్లాడుతూ నేటిసమాజంలో బాలలపట్ల వివక్షత తీవ్ర రూపందాల్చిందని బాల్యవివాహాలు, బాలలపైవేధింపులు ఎక్కువఅవుతున్నాయని బాలలను కాపాడవలసిన బాధ్యత అందరిపైనా ఉందని తెలియజేశారు. మండలంలో బాల్యవివాహాలు నిరోధించడానికి మండలస్థాయి అధికారులతో బాల్యవివాహ నిరోధక కమిటీని బాలల హక్కుల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మండలంలో ఏగ్రామంలోనైనా బాలలసమస్యలగురించి సమాచారం అందితే ప్రభుత్వశాఖల అధికారులు అందరం కలిసి ఆ బాలల సమస్యలను పరిష్కరించి బాలల హక్కులను కాపాడుదామని తెలియజేశారు. జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ
బాల్య వివాహాలు చేయడం వల్ల లైంగిక దోపిడీ, దాడికి గురవుతారని చిన్న తనంలో గర్భం డాల్చడం, మాతృ శిశు మరణాలు సంభావిస్తాయని జన్మించే శిశువు అంగవైకల్యంతో జన్మిస్తారని , పౌష్టికహర లోపం, రక్త హీనత సమస్యలు, మానసిక వేధింపులు గురవుతారని, ఎవరైనా బాల్య వివాహాలు చేసిన ప్రోత్సహించిన సహకరించిన వారిపై చట్ట పరమైన చర్యలు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందాన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీస్ సూపర్ వైజర్లు హెచ్ .బి .మాణిక్యాంబ,పి.వి కనకరత్నం ,రెవిన్యూ అధికారులు, గ్రామ పంచాయితీల కార్యదర్సులు ,పోలీస్ సిబ్బంది,మహిళా సంరక్షణ కార్యదర్సులు, పాల్గొన్నారు.