ఈ గొంతు లేని గాన గంధర్వుడు చెప్పిందే శాసనమా
గాయకులుగా గుర్తించాలంటే ఆ గది అనుమతి కావాలా
ఏ స్టేజి ఎక్కిన ఆయన సోది, సోదరి సోది వినాల
బ్యానర్లో మొదటి ఫోటో ఉండి తీరాల్సిందే నా
ఇతనే చెప్పిందే వేదమా
ఈ పాపారాయుడు తీర్పు శిరసా వహించాలా..
అందుకే దాడులు జరిగినా పట్టించుకోరా
నాడు సురేష్,నేడు సింధు లపై దాడులు అందుకే జరిగాయా
కౌతాధర్మ సత్రంలో ఇన్ని కుట్రలకు కారకులెవరు
ఇంకెంత మందిపై కుట్రలు చేస్తారు..
ఆ గది అరాచకాలకు అడ్డుకట్ట వేయలేరా
ఇంకెన్నాళ్లీ ఆధిపత్యం అనాలోచిత పనులు..
కౌతా కూల్చివేతే పరిస్కారమ..
వాలిపోతున్న వయస్సులో కూడా ఇలానా..
కౌతాకు కాలం ముగిసింది…కళారంగానికి కట్టడి అవసరం..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
కళలకు నిలయం కౌతా పూర్ణానంద ధర్మసత్రం.పేద కళాకారుల కోసమే ఈ ధర్మ సత్రాన్ని దాతల సహకారం తో నిర్మించారు.అయితే ఇప్పుడు సకల కళలకు నిలయంగా మారిందని చెప్పక తప్పడం లేదు.ఒకప్పుడు కళామ తల్లి బిడ్డలను చూస్తే కాళ్లకు నమస్కారం చేసి సంస్కారం చూపే వారు. నేడు కాళ్లతో తన్నేలా పరిస్థితి దాపురించింది. కారణం కళ అంటే ఓ మహిళే కదా అన్న బడుద్దాయులు పుట్టుకొచ్చారు.పుట్టుకతో గానం లేదు…సరిగమల సరగాలు తెలియదు… శృతి లయలు అంటే ఎక్కడ ఎంతందంగా ఉన్నారనే దౌర్భాగ్య స్థితికి వచ్చారు.
ఇలాంటి పెద్దమనుషుల ముసుగువేసుకుని మాటలకందని మాయలు చేస్తూ..చేతలకందని చిల్లర చేష్టలు చేస్తూ చెత్త ప్రసంగాలు ఇస్తూ చెలామణి అవుతుంటే చలించి పోతుంది కళా రంగం.ఎవరికి చెప్పుకోలేక చెప్పినా ఉపయోగం లేదనుకుని వీరు చేస్తున్న చిల్లర చేష్టలు చూసి కూడా ఏమి చేయలేక పోతున్నారు పేద కళాకారులు. ఇక్కడ పేద కళాకారులే కాదు పెద్ద కళాకారులు కూడా పైకి చెప్పుకోలేక పెదవి విరుస్తున్నారు.
ప్రధానంగా బెజవాడ అంటే నే కళలకు నిలయం.ఎందరో మహనీయులు ఇక్కడ కూడా రాణించి ఆపై స్థాయిలో కి వెళ్లారు.అలాంటిది గానం తెలియని కొంతమంది చేతుల్లోకి ఈ కళారంగం వెళ్ళింది. తమ ఉద్యోగ ధర్మం సరిగా నిర్వర్తించలేని కొంతమంది కౌతా వేదికగా స్థిర నివాసం ఏర్పరచుకొని వారు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యేటట్లు అక్కడ అన్ని సమకూర్చుకుని ఉన్నారు.దీనితో వారు ఏమి చెబితే అదే శిలాశాసనం గా మలుచు కుని కౌతా గాడి దఫాదర్ లాగా చెలామణి అవుతూ తనకు ప్రకృతి వరప్రసాదంగా దొరికిన చెల్లెమ్మను పొగుడుకుంటూ పబ్బం గడుపుకుంటూ గంభీరాలు పలుకుతున్నారు.
ఇటీవల ఓ సంస్థ గ్రంధాలయంలో స్టేజిపైకి పిలిచారు.పిలువందే ఆలస్యం మైకు తీసుకుని గొప్పలు. సరే మంచిది అదే గొప్పలు ఆచరణలో ఉండాలి కదా.ఓ నిరుపేద కుర్రాడు తనకు సంగీతం పట్ల మక్కువతో గాయకుడు గా ఎదగాలన్న తాపత్రయం తో ఎన్నో తంటాలు పడుతూ కౌతాలో ఓ గది తీసుకుని తన మానాన తాను పోతుంటే వీరి తప్పులపై కథనాలు వస్తే ఆ గాయకుడు ని ఒంటరి చేసి దాడికి దిగారు.అతను జర్నలిస్టు కూడా.అతనే నక్షత్ర కళా వేదిక అధ్యక్షుడు వలపర్ల సురేష్.అయ్యా అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ కూడా కారు కూతలు కూసి కేసును నీరు గార్చారు.ఇక పరాయి దేశం నుంచి వచ్చి పాటలు పాడుకుంటూ ఉన్న మరో సింగర్ సింధు పై దాడి జరిగితే ఆత్మ రక్షణ లో భాగంగా పెప్పర్ స్ప్రే వాడితే అది కూడా అంతే. అసలు కళారంగము లో ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి.తప్పు ఎవరిదా అన్నది ప్రక్కన పెడితే అసలు ఇలా అవ్వడానికి కారణం ఎవరు…ఎందుకోసం ఇలా జరుగుతున్నాయి.ఎవరు ఇలా చేయిస్తున్నారు.ఏదయినా ప్రమాదం జరిగితే ఆయా కుటుంబాలకు సమాధానం ఎవరు చెప్పాలి. ఇలాంటివి జరగకుండా ఏమి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేయలేని పెద్ద మనుషులు ఉండిన నేమి మండిన నేమి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.