Thursday, November 28, 2024

Creating liberating content

సినిమామ్యాడ్ స్క్వేర్ నుంచి లడ్డు గాని పెళ్లి గీతం విడుదల

మ్యాడ్ స్క్వేర్ నుంచి లడ్డు గాని పెళ్లి గీతం విడుదల

కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధానంగా రూపొందిన వినోదాత్మక చిత్రం ‘మ్యాడ్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ను తీసుకురాబోతుంది. కేవలం ప్రకటనతోనే ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో “లడ్డు గాని పెళ్లి” అనే బరాత్ గీతంతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది చిత్ర బృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా “లడ్డు గాని పెళ్లి”ని సెప్టెంబర్ 20న విడుదల చేశారు.’మ్యాడ్’ చిత్రంలో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన “కళ్ళజోడు కాలేజీ పాప” అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకొని చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం ఆయన స్వరపరిచిన “లడ్డు గానీ పెళ్లి” గీతం అంతకుమించిన ఆదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదు. తీన్మార్ బీట్‌ లతో థియేటర్లలో ప్రతి ఒక్కరూ కాలు కదిపేలా ఈ గీతం ఉంది.జానపద సంచలనం, గాయని మంగ్లీతో కలిసి భీమ్స్ సిసిరోలియో స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. వారి గాత్రం ఈ పాటకు మరింత ఉత్సాహం తీసుకొచ్చింది. సినిమా ఇతివృత్తం మరియు పాత్రలకు అనుగుణంగా.. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఎంతో అందంగా ఉంది. జానపద బీట్‌లు మరియు యువకులు ఆటపట్టించే రీతిలో జోకులు పేల్చుతూ సాగే సాహిత్యంతో, ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. వీక్షకుల అభిమాన గీతాల్లో ఒకటిగా ఇది తక్షణమే స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో అనుమానమే లేదు.మ్యాడ్ బాయ్స్ గ్యాంగ్ సంగీత్ శోభన్, నార్నే నితిన్ మరియు రామ్ నితిన్ “లడ్డు గానీ పెళ్లి” గీతంతో మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ నూతన గీతంలో “కాలేజీ పాప” పాట బిట్ ఇన్‌స్ట్రుమెంటల్‌ కి వారు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మ్యాడ్ స్క్వేర్’ తో రెట్టింపు వినోదాన్ని పంచడానికి, రెట్టింపు ఉత్సాహంతో మ్యాడ్ గ్యాంగ్ వస్తోందని ఈ ఒక్క పాటతోనే అర్థమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article