Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుకేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఇష్యూ... క్రికెట్‌ను ప్రేమించే ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య బ‌ల‌మైన సంభాష‌ణగా పేర్కొన్న...

కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఇష్యూ… క్రికెట్‌ను ప్రేమించే ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య బ‌ల‌మైన సంభాష‌ణగా పేర్కొన్న కోచ్ లాన్స్ క్లూసెన‌ర్


ల‌క్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) సార‌ధి కేఎల్ రాహుల్ పై ఆ జట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా నలుగురి ముందే విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందరూ దీన్ని తప్పు పడుతున్నారు కూడా. తాజాగా దీనిపై ల‌క్నో అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్ వివరణ ఇచ్చారు. క్రికెట్‌ను ప్రేమించే ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య బ‌ల‌మైన సంభాష‌ణ జ‌రిగింద‌న్నారు. అందులో త‌న‌కేమీ త‌ప్పు క‌నిపించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. లాన్స్ క్లూసెన‌ర్ మాట్లాడుతూ.. “ఇద్దరు క్రికెట్ లవర్స్ మధ్య జరిగిన చర్చలో నాకెటువంటి సమస్య ఉన్నట్లుగా కనిపించలేదు. అదొక టీ కప్పులో తుపాను వంటిది. ఇలాంటి చ‌ర్చ‌ల‌తోనే టీమ్‌ల ప్ర‌ద‌ర్శ‌న మెరుగ‌వుతుంద‌ని నా న‌మ్మ‌కం. కాబట్టి ఇదంత పెద్ద విషయమేమీ కాదు. ఇక కేఎల్ రాహుల్ తనకున్న ప్రత్యేక స్టైల్‌తోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ ఐపీఎల్ మాత్రం అతనికి చాలా కష్టంగా మారింది. కెప్టెన్‌గానూ అటు జట్టు వికెట్లు కోల్పోతుండటం తలనొప్పిగా ప‌రిణ‌మించింది. బ్యాటింగ్ విభాగం ల‌క్నో జట్టును క్లిష్ట పరిస్థితుల్లో పడేసింది. కీలకమైన సమయాల్లోనే వికెట్లు నిలబెట్టుకోలేకపోయింది” అని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న‌ చెప్పుకొచ్చారు.
కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా మ‌ధ్య‌ అసలేం జరిగిందంటే..
ఇటీవ‌ల‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ల‌క్నో సూపర్ జెయింట్స్ ప‌రాజ‌యం పాలైంది. హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ధాటిగా ఆడి 9.4 ఓవర్లలోనే ఎల్ఎస్‌జీ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేశారు. దీంతో తమ జట్టు కనబరిచిన ప్రదర్శనపై ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా విసుగెత్తిపోయాడు. సార‌ధి కేఎల్ రాహుల్‌ను మీడియాతో పాటు స్టేడియంలో అభిమానులు చూస్తుండగానే తిట్టిపోశాడు. ఈ వీడియో కాస్తా వైర‌ల్ కావ‌డంతో గోయెంకా తీరుపై నెటిజ‌న్లు, క్రికెట్ ప్రేమికులు మండిప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article