Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుపోలియో రహిత దేశమే.. మన ధ్యేయం..!

పోలియో రహిత దేశమే.. మన ధ్యేయం..!

జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

గాంధీనగర్ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభోత్సవం

కడప బ్యూరో:పోలియో రహిత దేశంగా మార్చే దిశగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయ వంతం చేయాలని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం కడప గాంధీ నగర్ పాఠశాల ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తోపాటు నగర కమీషనర్ జీఎస్ఎస్ ప్రవీణ్ చంద్, ఆర్డీవో మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. నాగరాజు, డిఐఓ డా. ఉమా మహేశ్వర్ కుమార్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా. బాలాంజనేయులు పలువురు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు భారత దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తుంటే… ఇందులో భాగంగానే మన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబందించి అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం 0-5 సంవత్సరాల లోపు చిన్నారులు జిల్లా వ్యాప్తంగా 2,28,131 మంది ఉన్నారని, వీరిలో ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాకు 3,04,900 పల్స్ పోలియో డోసులను స్టాక్ తెప్పించడం జరిగిందన్నారు. ఇందుకోసం 2029 పబ్లిక్ బూత్ లు, 51 మొబైల్ బూత్ లు, 23 ట్రాన్సిస్ట్ బూత్ లను ఏర్పాటు చేసి.. 8,467 మంది వ్యాక్సినేటర్లను సిద్ధంగా ఉంచామన్నారు. పల్స్ పోలియో నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 203 రూట్లకు గాను ఒక్కొక్క వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జన సంచారం ఉన్న ప్రాంతాలలో గ్రామాల నుండి వచ్చిన పిల్లలకు కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.
నేడు పోలియో చుక్కలు వేసుకొనని పిల్లలకు ఈ నెల 4, 5వ తేదీల్లో వైద్య సిబ్బంది మొబైల్ టీముల ద్వారాన్ఇంటింటికీ వెళ్ళి పల్స్ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కారూ కృషి చేయాలని తెలిపారు. ఈ మూడు రోజులను ప్రతిఒక్కరూ అత్యంత బాధ్యతగా తీసుకుని భవిష్యత్తు తరాలకు సంపూర్ణ ఆరోగ్యకర పౌరులను అందిద్దామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article