న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పష్టం చేసింది. ఒక్కో నియోజకవర్గంలో ప్రచార వాహనాల సంఖ్యను 5 నుంచి 13కు పెంచింది. నామిషన్ దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 రూపాయలు ఇతర అభ్యర్థులు 25,000 రూపాయలు చొప్పున డిపాజిట్ చెల్లించాలని పేర్కొంది. అలాగే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను.. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాష తో పాటుగా.. హిందీ, ఇంగ్లీష్‌లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని తెలిపింది.ప్రస్తుతం అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులపై పరిమితి ఉంది. ఈ నేపథ్యంలో వ్యయ పరిమితి సంబంధిత సమస్యల పరిశీలనల కోసం ఈ ఏడాది అక్టోబరులో ఈసీ ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.