Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఈసీ ఆదేశాలు

ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఈసీ ఆదేశాలు

ఇంకో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2019 తరహాలోనే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండోవారంలో తొలి దశ పోలింగ్ ఉండొచ్చు. మే 18 లేదా 20వ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. గడువు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్.. దేశ రాజధానిలో అత్యున్నత సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించే 2,150 మంది ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఏఎస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల, ప్రవర్తన నియమావళిపై వారికి అవగాహన కల్పించింది ఈసీ. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించిన వారిపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీపై దృష్టి సారించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగంపై బూత్ స్థాయిలో ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article