కూటమి నేతలు ఇసుక, మద్యాన్ని దోచుకుంటున్నారు
కప్పం కట్టనిదే పనులు జరగడం లేదు
చంద్రబాబు అబద్దాలకు రెక్కలు కట్టాడు
ఎన్నికలప్పుడు ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు
రూ. 10 వేలు జీతమని చెప్పి వాలంటీర్లను మోసం చేశాడు
ఎన్నికల్లో ఇష్టారీతిన అమలుకాని హామీలు ఇచ్చారు
బాబు వస్తే లిక్కర్ క్వాలిటీ పెంచి ఇస్తామని ప్రచారం చేశారు
మద్యాన్ని కూడా చంద్రబాబు మాఫియాలా మార్చారు
స్కిల్ స్కామ్‌లో ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.. చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎక్కడైనా ఉందా?
మీడియా సమావేశంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి
తాడేపల్లి:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా దోచుకో పంచుకో తినుకో మాఫియా నడుస్తోందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయిందని, ఓటాన్ అకౌంట్‌తో ఇన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు గడుస్తున్నా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని దుయ్యబట్టారు. ఐదు నెలల కూటమి పాలనలో ఇసుక, మద్యం మాఫియాను వివరిస్తూ వైయస్ జగన్..స్కిల్ స్కామ్‌లో ఈడీ ప్రెసనోట్‌ను వక్రీకరించిన తీరును మీడియా సమావేశంలో ఎండగట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావొస్తుంది ..చంద్రబాబు పాలన గమనిస్తే కనిపిచ్చేది ఏమిటంటే..ఎక్కడా కూడా మచ్చుకైనా కూడా ఈ ప్రభుత్వ హయాంలో ..మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా డీబీటీ కనిపించదు. చంద్రబాబు హయాంలో కనిపించేది ఏంటంటే డీపీటీ..దోచుకో..పంచుకో..తినుకో..ఈ పాలన మాత్రమే ఈ ఐదు నెలలుగా కనిపిస్తోంది.
ఎక్కడా కూడా సూపర్ సిక్స్ లేదు..సూపన్ సెవెన్ లేదు. ప్రజలు నిలదీస్తారేమో అని భయపడి..కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్ధ ప్రభుత్వం ఇదే. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఏది ఉండదేమో? ఇక్కడ మాత్రమే అలా జరుగుతుంది.
ఈరోజు రాష్ట్రంలో దారుణంగా డీపీటీ పాలన సాగుతుందంటే..ఎక్కడ చూసినా ఇసుక దగ్గర నుంచి మొదలు మద్యం వరకు, పేకటా క్లబ్‌లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఎవరు మైనింగ్ యాక్టివిటి చేయాలనుకున్నా..ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే కప్పం కట్టాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత..రాష్ట్రవ్యాప్తంగా దోచుకో..పంచుకో..తినుకో పాలన సాగుతోంది.
ఎన్నికలప్పుడు వీళ్లు ఏం చెప్పారు. ఒక అబద్ధానికి రెక్కలు కడుతారు. ప్రజల ఆశలతో చెలగాటమాడుతారు. వాళ్లకు ఉన్న మీడియా సామ్రాజ్యంతో కలిసి గోబెల్స్ ప్రచారంలో భాగమవుతారు. ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతారంటే..వీళ్లు, వీళ్లకు సంబంధించిన ఎమ్మెల్యేఏల, కార్యకర్తలు అబద్ధాలను వాడుకుంటారంటే..ఇంటింటికి వెళ్లి వలంటీర్లకు రూ.10 వేలు జీతం అంటూ మోసం చేశారు.
ప్రచారంలో భాగంగా చిన్నపిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు, అమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు అంటారు. పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.45 వేలు ఇస్తాం..సంతోషమా? అంటారు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు సంతోషమా అంటారు. రైతు కనిపిస్తే నీకు 20 వేలు అని ఊదరగొట్టారు. ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి వచ్చారు
రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని అధికారంలోకి వచ్చిన తరువాత బీద అరుపులు మొదలుపెట్టారు. మరోవైపు ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని భయభ్రాంతులకు గురి చేయడం, అడిగే స్వరం వినపడకుండా చేయాలని ఆరాటపడటం జరుగుతున్నాయి. వీటికి తోడు మార్పులు తీసుకువస్తున్నామంటూ స్కామ్‌లకు తెర లేపుతున్నారు. ఇదీ వాళ్ల మోడస్ ఆపరేండ.
ఏ రకంగా అవినీతి చేస్తారన్నదానికి కొన్ని ఊదాహరణలు చెబుతాను. ఇసుకకు సంబంధించి ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నారో గమనించండి. ఎన్నికల సమయంలో ఏమన్నారు..ఇసుక ధరలు విఫరీతంగా పెంచారని అన్నారు. వీళ్లందరిని ఒక్కటే అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 141 నియోజకవర్గాల్లో యావరేజ్‌గా లారీ ఇసుక రూ.30 వేలు పైగా ఉంది. కొన్ని చోట్ల లారీ ఇసుక రూ.60 వేలు పైగా ఉంది. ఒకవైపు ఇసుక ఉచితం అంటారు. మరోవైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం సున్నా అయ్యింది. రేట్లు చూస్తే గతంలో ఉన్న రేట్ల కన్నా రెండింతలు పెరిగాయి.
గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ పెడితే..ఈ ప్రభుత్వం రాగానే స్టాక్ యార్డ్‌లను ఖాళీ చేసింది. ఇవన్నీ వాస్తవాలు కనిపిస్తున్నాయి. దోపిడీ ఏ స్థాయిలో ఉందో టెండర్ డాక్యుమెంట్ చూడాలని వీడియో ప్రదర్శించారు. రెండు రోజులు మాత్రమే టెండర్లకు అవకాశం ఇచ్చారు. అందరూ దసరా పండుగలో నిమగ్నమై ఉంటే 180 రీచ్‌లకు టెండర్లు పిలిచారు. 8వ తేదీ బిడ్ నోటీసు ఇచ్చారు. 10 తేదీ వరకు అవకాశం ఇచ్చారు. రెండు రోజుల్లో ఎవరైనా టెండర్లు వేస్తారా?. ఎవరైనా పొరపాటున టెండర్ వేస్తే బెదిరించడం, ఒక మాఫియా తయారైంది. ప్రభుత్వమే దోచుకునే కార్యక్రమం ఇది. నీకింతా, నాకింత అంటూ పంచుకోవడం..ఇంత దారుణంగా మాఫియా సామ్రాజ్యం నడుపుతున్నారు.
2014-2019 మధ్యలో కూడా ఇలాగే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే..అప్పుడు కూడా ఇసుకను దోచుకున్నారు. మొదట డ్వాక్రా మహిళలకు ఇసుక టెండర్లు అన్నారు. ఆ తరువాత వాళ్ల నుంచి చంద్రబాబు తన మనుషులకు రీచ్‌లను అప్పగించారు. చంద్రబాబు ఇంటి పక్కనే పొక్లైన్లు పెట్టి తోడుకొని దోచుకున్నారు. ఇప్పుడు భాగస్వాములుగా ఉన్న పార్టీలు భయం వీడి దోచుకుంటున్నారు. అడిగే వారు లేరని రెచ్చిపోతున్నారు.
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శంగా ఇసుక పాలసీ ఉండేది. దోపిడీకి అవకాశం లేని విధంగా ఇసుక పాలసీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ప్లాట్‌ఫాంపై ఈ-టెండర్లు పిలిచాం. ఎవరైనా పాల్గొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా అత్యధిక బిడ్డర్లకు కాంట్రాక్ట్ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వానికి కచ్చితంగా రాయితీ కట్టేలా చూశాం. ఏడాదికి రూ.700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పారదర్శకంగా ఈ-టెండర్ ద్వారా ఆరోజు పాలసీ తెచ్చాం. ఈ రోజు ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఎవరికి ఉచితంగా ఇసుక ఇస్తున్నానని ప్రశ్నిస్తున్నాను.
గతంలో ఏ నియోజకవర్గంలో ఎంత రేటుకు ఇసుక అమ్మాలని ప్రతి వారం పేపర్లో ప్రకటనలు వచ్చేవి. ప్రభుత్వంసూచించిన రేట్ల కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకునేవాళ్లం. ఇసుక రేట్లు ఇప్పుడు రెండింతలు ఎక్కువకు అమ్ముతున్నారు. ఇసుక కొనాలనుకుంటున్నా కూడా వీళ్లే కృత్రిమ కొతర సృష్టించి దోచుకుంటున్నారు.
లిక్కర్ స్కామ్..
ఎన్నికల సమయంలో ఏ మాదిరిగా అబద్ధానికి రెక్కలు కట్టారో చూడవచ్చు. ఎవరి హయాంలోనైనా అవే మద్యం డిస్లరీలు ఉండేవి. రాష్ట్రంలో 20 డిస్లరీలు ఉంటే ఇందులో 14 డిస్టరీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. మిగిలిన ఆరు డిస్టరీల లైసెన్స్లు అంతకు ముందు వచ్చినవే. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అదే లిక్కరే ఉంది. వెంటనే అబద్ధాలకు రెక్కలు కట్టి నాసిరకం మద్యం అంటూ దుష్ప్రచారం చేశారు.
చంద్రబాబు ఎన్నికల సమయంలో రూ.99లకే లిక్కర్ ఇస్తామని ఊదరగొట్టారు. చంద్రబాబు ఏరకంగా స్కామ్‌లుగా మార్చుతారో ఇది ఇక ఊదాహరణ. ఎన్నికల అయిపోయిన తరువాత పరిస్థితి చూస్తే ..ఐదు నెలలు కావొస్తుంది. చంద్రబాబు హయాంలో బ్రాండ్లు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. అప్పట్లో భూమ్ భూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, పవన్ స్టార్ 999, రష్యాన్ , హెవెన్స్ డోర్, క్రేజీ డార్క్, నెఫోలియన్, సెవెన్త్ హెవెన్, హైడ్రాబాద్ బ్రాండ్ విస్కీ, బ్లామ్ డే..బ్రాండ్లు ఉండేవి. చివరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు కొత్త బ్రాండ్లు రిలీజ్ చేశారు. 14.05.2019లో కొత్త బ్రాండ్లు చంద్రబాబు రిలీజ్ చేశారు.
అవే డిస్టరీస్, బ్రాండ్లు మారుతాయి, నోటిఫైడ్ డిస్లరీలు అవునా? కాదా అన్నది మాత్రమే తేడా. అదే క్వాలిటీతోనే మద్యం వచ్చింది. చంద్రబాబుహయాంలో అమృతం, వేరే ప్రభుత్వం వస్తే విషం అంటూ ప్రచారం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కదా..అవే బ్రాండ్లు వస్తున్నాయి కదా? ఒక పద్ధతి ప్రకారం మద్యం మాఫియాను నడుపుతున్నారు.
మా ప్రభుత్వ హయాంలో మద్యాన్ని నిరుత్సాహపరిచాం. మద్యం దుకాణాలు 4380 ఉంటే..అందులో 2038 షాపులు తగ్గించాం. లాభాపేక్ష ఉంటే మద్యాన్ని నియంత్రించలేమని ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. లిక్కర్ షాపుల టైమింగ్స్ మార్చాం. పర్మిట్ రూములు రద్దు చేశాం. బెల్ట్‌షాపులు కట్టడి చేశాం. చంద్రబాబుహయాంలో 43 వేల బెల్ట్‌షాపులు ఉండేవి. నేను వచ్చిన తరువాత ఇవన్నీ రద్దు చేశాం.
వైయస్ఆర్‌సీపీ హయాంలో మద్యం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చూశాం. చంద్రబాబు హయాంలో ప్రతి ఏటా వ్యాల్యూమ్ పెరిగింది. 2014-2019 మధ్యలో 3.80 కోట్ల కేసులు విక్రయించారు. మన హయాంలో వాల్యూమ్స్ నిరుత్సాహ పరుస్తూ, నియంత్రిస్తూ తీసుకున్న చర్యల వల్ల తగ్గించాం. వైయస్ఆర్‌సీపీహయాంలో మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా తగ్గలేదు. పేదవాడికి మంచి చేశాం.
చంద్రబాబు హయాంలో ఆయన చేసింది ఏంటని గమనిస్తే..ఈ రోజు చంద్రబాబు దోపిడీ ఏ రకంగా ఉందంటే..మద్యం రేటు తగ్గిస్తాడట..తద్వారా క్వాలిటీ తగ్గించి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించి డిస్లరీల వాల్యూమ్స్ పెంచి డిస్లరీల ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నడుస్తున్న షాపులను రద్దు చేశాడు. మాఫియా సమ్రాజ్యానికి ఈ రోజు చంద్రబాబు మద్యం షాపులను కట్టబెట్టాడు.
మద్యం షాపులన్నీ కూడా చంద్రబాబు తన మాఫియాకు కట్టబెట్టాడు. 30 శాతం కమీషన్లు ఇవ్వాలని బెదిరించడం, మాట వినకపోతే కిడ్నాప్ చేయడం, టెండర్ ద్వారా షాపులు పొందిన వారిపై దాడులు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే. చందరబాబుకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, మాఫియా ముఠాకు ఇంత అంటూ పంచుకుంటున్నారు. లిక్కర్ పాలసీ మంచి చేసేది అయితే , ఎందుకు ఎమ్మెల్యేలు ఈ మాదిరిగా కిడ్నాపులు చేస్తున్నారు. దాడులు చేయిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు.
ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువకు మద్యాన్ని విక్రయించి వీళ్లంతా పంచుకుంటారు. ఇప్పటికే ఎమ్మార్పీల కంటే ఎక్కువకు మద్యాన్ని అమ్ముకుంటున్నారు. రెండు రోజులు పోతే పర్మిట్ రూములు పక్కనే వెలుస్తాయి. గ్రామాల్లో బెల్ట్‌షాపులు వస్తాయి. మాఫియా సామ్రాజ్యం రెచ్చిపోతుంది.
చంద్రబాబు రూ.99లకే మద్యం ఇస్తామంటున్నాడు. ఇది కూడా ఒక స్కామే. కొద్ది రోజులు ఆగితే అది కూడా బయటకు వస్తుంది. తక్కువ రేటుకు ఇస్తున్నాడంటే అందులో ఎంత క్వాలిటీ ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజల జీవితాలే కాదు..ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇందుకోసం డిస్ట్రిబూషన్ చానల్‌ను కంట్రోల్‌లోకి తీసుకున్నాడు.
స్కిల్ స్కామ్..
చంద్రబాబు అబద్ధాలకు ఏ స్థాయిలో రెక్కలు కడుతారంటే..స్కిల్ స్కామ్‌లో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈడీ ఒక పత్రిక ప్రకటన గమనిస్తే..ఇందులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చీట్ ఇచ్చినట్లు ఎక్కడైనా ఉందా? ప్రెస్‌నోట్‌లో ముఖ్యాంశాలు వీడియో రూపంలో మీడియాకు వైయస్ జగన్ వివరించారు. ఈడీ లెటర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇదే కేసులో చంద్రబాబుతో పాటు సుమన్‌బోస్, వికాస్ కల్కేకర్ నిందితులే. వీరికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ ప్రెస్‌నోట్ ఇచ్చింది. 13చోట్ల చంద్రబాబు ఫైళ్లపై సంతకాలు చేసి రూ.370 కోట్లు ఇస్తే వీరు షెల్ కంపెనీ ద్వారా దోచుకున్నారు. చంద్రబాబు అఫిషియల్ వెబ్‌సైట్‌లో నిజం నిలిచింది..న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఈ మాదిరిగా వక్రీకరించడం అన్నది ఎవరికి సాధ్యం కాదు. ఒక్క చంద్రబాబుకే అది సాధ్యం. నిందితుల ఆస్తులు ఈడీ అటాచ్ చేస్తే..చంద్రబాబు సమాధానం చెప్పరు. వీరికి ఎల్లోమీడియా వత్తాసు పలుకుతుంది.
చంద్రబాబు ఎందుకు ఈ మాదిరిగా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. అసలు ఈడీ ప్రెస్‌నోట్‌లో క్లీన్‌చిట్ అని ఉందా? సుమన్‌బోస్, వికాస్‌కు డబ్బులు ఎవరిచ్చారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? సిమెన్స్ కంపెనీయో ఆ డబ్బులు మాకు ముట్టలేదని చెప్పింది వాస్తవం కాదా? . ఆ డబ్బులు దారి మళ్లించడం వాస్తవం కాదా? హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి ఆ డబ్బు చేరింది వాస్తవం కాదా? ఇద్దరు ఐఏఎస్ అధికారులు మెజిస్ట్రేస్ ముందు వాగ్మూలం ఇచ్చింది వాస్తవం కాదా?, ఇవన్నీ కనిపిస్తుంటే..చంద్రబాబు మాత్రం న్యాయం గెలిచింది, నిజం నిలిచింది అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఇంత దారుణమైన స్కామ్ కంటికి కనిపిస్తున్నా వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు.
లడ్డూల విషయమేకానీ, ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్ కానీ, లిక్కర్ కానీ ఇవన్నీ కూడా అబద్ధాలకు రెక్కలు కడుతారు. నిజంగా వీళ్లు మనుషులేనా? అందరూ ఆలోచన చేయాలి. వీళ్ల స్కామ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయంటే..మనమంతా కూడా విజయవాడ వరదల్లో చూశాం.
వరద బాధితులకు భోజన ఖర్చు రూ.368 కోట్లు అంటా? అసలు రిలీఫ్ క్యాంపులు విజయవాడలో ఉన్నాయా? ఎవరికి భోజనాలు పెట్టారు. క్యాండిల్, అగ్గిపెట్టేలు, మొబైల్ జనరేటర్లు అంటూ రూ.23 కోట్లు దోచేశారు. సాక్షి పత్రిక ఈ అవినీతిని రాసిందంటూ ఎడిటర్‌పై కేసు నమోదు చేశారు. ఎవరూ ప్రశ్నించకూడదు. మాట్లాడితే కేసులు అంటూ భయపెడుతున్నారు. ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నారు. ఇలాంటి పాలన తగునా అన్నది ప్రజలు ఆలోచన చేయాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
బంతిని ఎంత గట్టిగా నేలకు వేసి కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. చేసిన తప్పుకనిపించకూడదు. ఏ తప్పైనా చేయవచ్చు అన్న దుక్పథంలో అధికారంతో ఇష్టం వచ్చినట్లు కేసులు పెడితే ప్రజలు తిరుగబడుతారన్నది వాస్తవం. వీటన్నింటికి ప్రజలు, కోర్టులే సాక్ష్యం. ఇవన్నీ కూడా కళ్లేదుటే జరుగుతున్నాయి. ఆడవాళ్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వారందరికీ వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. ప్రజల తరుఫున పోరాటం చేసేందుకు మేం ముందుంటామని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం పార్టీని బలోపేతం చేస్తూ ప్రిపెయిర్డ్‌గా ఉన్నాం.
ఈవీఎంలపై మా న్యాయ పోరాటం కొనసాగుతోంది. ఒంగోల్‌లో 12 బూతులకు సంబంధించి ఈవీఎంలు, వీవీ పాట్లు లెక్కించాలని మేం కోర్టులో కేసు వేశాం. ఎందుకు లెక్కించడం లేదు. ఈసీ ఎందుకు హైకోర్టులో మాక్ పోలింగ్ చేయమంది అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి హైకోర్టులో ఈసీ వాదిస్తోంది. ఇది అన్యాయమే కదా? 90 శాతం డెవలప్‌డ్ కంట్రీస్ పేపర్ బ్యాలెట్‌పై ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. అమెరికాలో కూడా పేపర్ బ్యాలెట్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాకు వివరించారు.