గాజువాక : కలియుగ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక 65 వ వార్డు పరిధి వాంబే కాలనీ కొండపై నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బుదవారం ఉత్తరాంధ్ర షాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామి , కాండూరి వెంకటరమణాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు చేసి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయాకమిటి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిదులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంతకు ముందు యాగశాలలో మహా హోమం చేపట్టి, ఆలయ శిఖరంపై కవశ పూజ జరిపారు. యంత్రప్రతిస్త చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి, మహమ్మద్ ఇమ్రాన్, రాజాం రామారావు, పెండాడ రాజారమణి, మంత్రి రాజశేఖర్, విగ్రహ దాతలు పెంటకోట నాగేశ్వరరావు, మిత్తని అప్పల రెడ్డి, పెంటకోట శంకర్రావు, జెర్రిపోతుల ముత్యాలరావు, మంత్రి శంకర్ నారాయణ,తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్, గున్నా శ్రీనివాసరావు, మొల్లి చిన్న,నక్క వెంకటరమణ, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, పెంటకోట రాజు, గురుసు రామలక్ష్మి, తిప్పల స్వాతి, పప్పల పుష్ప, పండురి రామారావు, పండూరి సత్యవతి, బొబ్బిలి స్వాతి,పద్మ, రత్నం, చిన్నమ్మలు,పద్మ,శరగడంసావిత్రి, లక్ష్మి, నాగమణి, వరలక్ష్మి,కవిత, స్వాతి,అరుణ, సరోజినీ , సొంతశ్,వరలక్ష్మి , బాధి లక్ష్మి , సాజన్ సింగ్, దశరథ్ సింగ్, అనార్కాళీ, చాందిని, వెంకటలక్ష్మి , కనక లక్ష్మి తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు