ఇదిగో పరిష్కరిస్తాం !అదిగో పరిష్కరిస్తాం! అని కాలయాపన చేయడమే అధికారులు పని!గత నాలుగు సంవత్సరాలుగా ఇదే తీరు!
వేలేరుపాడు:గత నాలుగు సంవత్సరాలుగా వేలేరుపాడు మండల ప్రజలు లో వోల్టేజి విద్యుత్ సరఫరాతో అష్ట కష్టాలు పడటం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతగానో నష్టపోవడం జరుగుతుంది. ఇంత జరుగుతున్న విద్యుత్ అధికారులు పరిష్కరిస్తామన్న ఒకే మాటతో నాలుగు సంవత్సరాలు గడిపారే తప్ప, ఏ ఒక్క గ్రామంలో పరిష్కరించిన పాపాన పోలేదు, (అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని )అన్న చందంగా ఈ మండలంలో ప్రజలు గృహపకరణాలకు విద్యుత్ పరికరాలను సమకూర్చుకున్నప్పటికీ, వాటిని వినియోగించుకునే పరిస్థితి లేక , లో వోల్టేజి కారణంగా ఫ్రిజ్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు, మిక్సీ, గ్రైండర్లు వంటివి పనిచేయకపోవడంతో, అలంకారప్రాయంగా ఉన్నాయే తప్ప ఉపయోగపడిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు, ఇక మండల కేంద్రంతో సహా పలు గ్రామాలలో బ్రతుకుతెరువుకై ఏర్పాటు చేసుకున్న, వెల్డింగ్ షాపుల వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది, అదే పనిపై తమ కుటుంబాలను పోషించుకోవాల్సిన వారు పని వచ్చిన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక, లోఓల్టేజీ కారణంగా వారి పరికరాలు పనిచేయక ఎంతో మనోవ్యాతనకు గురికావాల్సిన దుస్థితి నెలకొందని మోపుతున్నారు, వేలేరుపాడు వెళితే వెల్డింగ్ పనులు జరిగే పరిస్థితి లేదని ,ఆ పనులను చేయించుకునే వారంతా పక్క రాష్ట్రమైన అశ్వరావుపేటలోని వినాయకపురం, అశ్వరావుపేట కు వెళ్లి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది, ఇదే పరిస్థితి మండలంలోని దరిదాపు అన్ని గ్రామాలలో నెలకొనడంతో వారి వారి గృహపాకరణ పరికరాలన్నీ లోఓల్తేటిజి కారణంగా పనిచేయకపోవడం, ఒకవేళ పని చేసిన అవి కాలిపోవడం తో ఎంతగానో నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. ఇంత జరుగుతున్న ఏ గ్రామంలో ఎంత సరఫరా అవసరమో! తదానుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్న కనీస అవగాహన అధికారులకు లేఖనో! లేక ప్రభుత్వాన్నించి ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసే పరిస్థితి లేకపోవడంతో నో?ఈ సమస్యను ఎవ్వరు పరిష్కరించలేకపోతున్నారేమో నన్న ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి, ప్రస్తుతం ఆ ప్రభుత్వ శకం ముగిసిందని, ప్రజా ప్రభుత్వం వచ్చిందని! ఇప్పుడైనా సంబంధిత అధికారులు, ఆ వైపుగా దృష్టి కేంద్రీకరించి ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తారన్న కొండంత ఆశతో మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.