నేడే పల్స్ పోలియో
నల్లచెరువు:శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండ్ సర్కిల్ వరకు శనివారం డాక్టర్, కల్పన, అలేఖ్య ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, పుట్టిన బిడ్డనుండి ఐదు సంవత్సరాల లోపల ఉన్న పసిపిల్లలకు పల్స్ పోలియో రెండు చుక్కలు వేయించాలని, పోలియో కేంద్రాలు, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, తెలియజేశారు. మండల కేంద్రంలో బసవన్న కట్ట, అంబేద్కర్ కాలనీ, బస్టాండ్, వీవర్స్ కాలనీ, రైల్వే స్టేషన్,మరికొన్నిచోట్ల పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, సిహెచ్ఓ రామచంద్ర రెడ్డి తెలిపారు. పోలియో రెండు చుక్కలు బిడ్డలకు అంగవైకల్యం నుండి ఎదుర్కొనే ఏకైక మార్గమని,పోలియో రాకుండా నివారించవచ్చని బస్టాండ్ సర్కిల్లో ప్రజలకు సలహా సూచనలు తెలియజేశారు. ఎవరైనా పల్స్ పోలియో వేయించుకొని ఉన్నవారిని గుర్తించి ఇంటి వద్దకే వెళ్లి 5,6, తేదీన ఆశ వర్కర్ల చేత పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తామని 100% శాతం ఈ కార్యక్రమం విజయవంతం చేసి తీరుతామని డాక్టర్ కల్పన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.