తనకల్లు:ఈ నెల 4న పెనుకొండలో జరిగే ‘రా కదిలిరా’ బహిరంగసభను విజయవంతం చేయాలనీ తనకల్లు టీడీపీ మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం తోట సరోజమ్మ మహిళా కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, కదిరి అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది కుంట వెంకట ప్రసాద్ పిలుపు మేరకు మండలం నుండి పెద్దసంఖ్యలో తరలి రావాలన్నారు. కదిలిరా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారన్నారు. భారీగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుత వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే అందరి సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అదేవిధంగా మన టీడీపీ అభ్యర్థికి మొదటి జాబితాలో లేదని కొందరు రాజకీయం చేస్తున్నారని, అలాంటి గాలి మాటలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. గతంలో చంద్రబాబు కదిరికి విచ్చేసినప్పుడే సభాముఖంగా తన పేరు ఖరారు చేశారని, అధిష్టానం ఆ మాటను కట్టుబడి ఉందని, ఇందులో ఎలాంటి అపోహ లేదన్నారు. టికెట్ విషయంలో అధిష్టానం స్పష్టంగా ఉందని, నియోజకవ, మండల ప్రజలు కూడా స్పష్టంగా ఉండాలని కోరారు. మనమందరం ఏకమై కదిరినియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులుశంకర్ నాయుడు,మాబాషా, సోంపాళ్యం నాఘభూషణ, రెడ్డిభాష, జనసేన పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.