మార్కాపురం:మార్కాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ గా మహేశ్వరం రఘురాం తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈయన కడప కేంద్ర కార్యాలయం నుండి ఇక్కడికి బదులుపై వచ్చారు. ఇక్కడ రీజినల్ మేనేజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ ప్రసాదు కడప జిల్లా రీజినల్ మేనేజర్ గా బదిలీపై వెళ్లారు.
నూతన అర్ ఎం గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ఏపీజీబీ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ సిబ్బంది శాయు శక్తుల కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ముఖ్యంగా తమ శాఖలు గ్రామీణ ప్రాంతాలలో చిన్న సన్న కారు రైతులకు, చిరు వ్యాపారులకు, సామాన్య పేద రైతులకు బాసటగా నిలుస్తూ రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
నూతన రీజినల్ మేనేజర్ గా బాధ్యతలను చేపట్టిన సందర్భంగా మహేశ్వరం రఘురాం కు కార్యాలయం సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.