మేకల తిరుమలరెడ్డి.
రామచంద్రపురం :టిడిపి సభ్యత్వమే ప్రతి కుటుం బానికి భరోసా కల్పిస్తుందని రామచంద్రపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి అన్నారు శుక్రవారం మండల టిడిపి కార్యాలయంలో టిడిపి సభ్యత నమోదు పై మీడియా సమావేశము నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మండలంలోని అన్నిగ్రామాల్లో తెలుగు దేశం పార్టీ కొత్తగా సభ్యత్వం నమోదు. పాత సభ్యత్వాలు రెన్యూవల్, చేసుకోవచ్చున్నారు. .18సంవత్సరాలు వయస్సు కలిగిన ఓటు హక్కు కలిగిన టీడీపీ అభిమానులు, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవచ్చున న్నారు. టిడిపి సభ్యత్వం నమోదుకొరకు ఓటర్ ఐడి, ఆధార్ నెంబర్, ఫోటో ఫోన్ నెంబర్ తో పాటు సభ్యత్వం రుసుము రూ.100 రూపాయ లు చెల్లించాలన్నారు.అదే జీవిత కాల సభ్యత్వం కావాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని పేర్కొ న్నారు. వాట్సప్ యాప్ ద్వారా గాని, టెలిగ్రామ్ బాట్ ద్వారా గానీ,వెబ్సైట్ ద్వారా గాని సభ్య త్వం నమోదు చేసుకోవచ్చన్నారు. టిడిపిసభ్యత్వం కలిగిన ప్రతి కుటుంబానికి టీడీపీ భరోసా కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. యువ నాయ కులు నారా లోకేష్ బాబు కార్య కర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కుని 2014 సంవత్సరంలో ప్రమా దవశాత్తు మరణించిన వారికి 2లక్షల ప్రమాదభీమా మొత్తాన్ని 5లక్షలకు పెంచారని తెలిపారు. అదే విధంగా సభ్యత్వంతీసుకున్న కుటుంబ సభ్యులకు మరియు వారి పిల్లలకు విద్య,వైద్యం, ఉపాధి కల్పన కోసం నైపుణ్య శిక్షణను ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అలాగే టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు, క్లస్టర్, డివిజనల్ ఇన్చార్జిలు , వేగవంతం చేయాలని కోరారు.