పేదలకు. ఆహారం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు
అన్న క్యాంటీన్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు కోటి రూపాయలు విరాళం
వైసీపీ వాళ్ళు రివర్స్ టెండరింగ్ తో అంతా నాశనం చేశారు
సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
ప్రజలకు దూరంగా మాజీ సీఎం…ప్రజల్లోనే ఉండాలనేది మా సీఎం
అన్న క్యాంటీన్లు కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.మరికొద్ది గంటల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్దమవుతుందటం తో గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి…చుట్టుగుంట లో ప్రారంభానికి సిద్ధంగా అన్న క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి,గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసరావు తో కలిసి మంత్రి పరిశీలించారు..క్యాంటీన్ భవనం నిర్మాణం,వడ్డించే ప్రాంతం,చేతులు కడుగుకునే ప్రాంతం,అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు..ఏర్పాట్లు పరిశీలన తర్వాత మంత్రి నారాయణ మీడియా తో మాట్లాడారు.
గత టీడీపీ ప్రభుత్వంలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించాం.ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లు రద్దు చేసి ఆ భవనాలను ఇతర అవసరాలకు వినియోగించిందన్నారు మంత్రి.అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు…ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు..రేపు సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ లు ప్రారంభించనున్నారు…గతంలో మాదిరిగానే చక్కటి వాతావరణంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు.మొదటి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాము.రేపు సీఎం ప్రారంభించిన తర్వాత ఎల్లుండి మిగిలిన మరో 99 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి నారాయణ.గుంటూరులో మొత్తం 8 క్యాంటీన్లు ఉండగా వాటిలో ఏడు క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు …అన్న క్యాంటీన్లు ఏర్పాటుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు…ఒక రోజుకు ఒక వ్యక్తికి ఆహారం అందించడానికి 90 రూపాయలు ఖర్చవుతుందని….15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే మిగిలిన 75 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు.అన్న క్యాంటీన్లుకు విరాళం ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు.నిన్న ఒక దాత శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వగా..ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గారు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు..ఈ నిధిని కార్పస్ ఫండ్ గా ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీని క్యాంటీన్ అవసరాలకు వినియోగిస్తాం.కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతల పేరుతో ఒకరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ లకు ఆహారం సరఫరా చేస్తామన్నారు..విరాళం ఇవ్వాలనుకునే దాతలు పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.