అనంతపురము
రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఆయన సతీమణి భువనేశ్వరి, సోదరుడు వై.శ్రీనాథ్ రెడ్డితో కలిసి సర్వ ప్రాణ కోటికి ప్రత్యక్ష దైవం, బూదగవిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ, రథసప్తమి రోజున కుటుంబంతో కలిసి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నియోజకవర్గ ప్రజానీకం అంతా ఆరోగ్యంగా ఉండాలని ఆ సూర్య భగవానుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
అంతకుముందు గ్రామ సర్పంచ్, వైస్సార్సీపీ నేతలు, కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారిని సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే వెంట బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ.రమణ, ఎంపీపీ నరసింహులు, జెడ్పిటిసి పార్వతమ్మ, మాజీ ఎంపీపీ చంద్రమ్మ, నాయకులు ధనుంజయ, కౌడికి గోవిందు, వన్నప్ప, తిప్పయ్య, భీమేష్, హనుమప్ప తదితరులు ఉన్నారు.