Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుబీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా ఎలాంటి మార్పు లేదు: ప్రధాని మోదీ

బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా ఎలాంటి మార్పు లేదు: ప్రధాని మోదీ

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పోయి, కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో మార్పు లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ ఒకటేనని ఆరోపించారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్‌, లూఠ్‌ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో త్వరలో 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు. త్వరలో జగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను గెలవాలని ప్రధాని అన్నారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ… ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవ సభ అని చెప్పారు. 15 రోజుల వ్యవధిలో 5 ఎయిమ్స్ లను ప్రారంభించామని తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని చెప్పారు. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని మోదీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లుగా వారి పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినపుడు ఎన్నికల గురించి చూసుకుందామని ప్రధాని వ్యాఖ్యానించారు. అబ్‌ కీ బార్‌ నాలుగు వందలపైన.. బీజేపీకి ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.తెలంగాణలోని గ్రామగ్రామంలో యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ కలిసి అబ్‌ కీ బార్‌.. చార్‌ సౌ పార్‌ అని నినదిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణలో సమ్మక్కసారక్క ట్రైబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మోదీకి గ్యారెంటీపై దేశంలో ప్రస్తుతం చర్చ నడుస్తోందన్నారు. పసుపు రైతులకు అన్ని తరపున మద్దతు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణకు ఒక మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఇచ్చామన్నారు. నా దేశం నా కుటుంబం అన్న భావనతో ప్రజల కోసం తాను జీవిస్తున్నానని వివరించారు. అందరి ఆశీర్వాదం..ప్రేమ తనకు కావాలని మోదీ కోరారు.ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్‌ సంస్థలను ప్రారంభించామని, సమ్మక్క-సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీని స్థాపించామని తెలిపారు. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మోదీ గ్యారంటీ అంటే, కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. పతీ క్షణం మీకోసం పని చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. 140 కోట్ల ప్రజలే తన కుటుంబమని చెప్పుకొచ్చారు.ప్రజల కలల సాకారం కోసం తాను పని చేస్తున్నాని వెల్లడించారు. రామమందిర ద్వారాలు తెలంగాణలో తయారయ్యాయన్నారు. రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. వికసిత్‌ భారత్‌ కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ 400 సీట్లలో గెలవాలి.’ అని మోదీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే రాలేదని, ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు. ఈ పదిహేను రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో రెండు ఐఐటీలు, 3 ఐఐఎంలు, ఒక్క ఐఐఎస్‌, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article