మార్చి 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరబోతున్నానంటూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాసారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకూ తన వెంట ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలనీ, ఎందుకంటే ర్యాలీలో పాల్గొనేవారికి తను ఆహార సరఫరా ఏర్పాట్లు చేయడంలేదని తెలిపారు. వైసిపిలో ఎందుకు చేరుతున్నారనే దానికి సమాధానం ఇస్తూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.తను ఏ పార్టీలో వున్నా పేదల సంక్షేమానికే కట్టుబడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.