కడప సిటీ:నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాం లను ప్రమాదాల నుండి కాపాడాలంటే,టెలిమెట్రీ కొరకు నిధులు విడుదల చేయాలని శ్రీరాములు డిమాండ్చేసినారు. తెలంగాణలోని కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదాల్లో ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యామ్ లో ప్రమాదంలో ఉన్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాం లు లీకేజీలు మరమ్మత్తులు తక్షణమే చేయాలని జాతీయ డ్యాం భద్రత నివేదికల ద్వారా తెలుస్తున్నాయి.. జల శక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు శ్రీరామ్ డ్యాం స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలనలో పై విషయాలు తేలినట్టుగా గుండ్లకుంట శ్రీరాములు తెలిపారు. పునాదుల వద్ద గోతులు, డ్రైనేజీల దగ్గర రంధ్రాలు, గాలిదారులు బ్లాక్ కావడం వలన డ్యామ్ భద్రతకు ప్రమాదం ఉన్నట్లుగా నిపుణులు గ్రహించారు. డ్యామ్ భద్రత చట్టం 2021 నిబంధనల ప్రకారం వర్షాకాలం రాకమునుపుకు ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను పర్యవేక్షణలో భాగంగా నిపుణులు పై సమస్యలను గుర్తించారు. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు 6.12 కోట్లు రూపాయల టెలీ మెట్రి పరికరాన్ని నిధుల లేమితో ఇంతవరకు విడుదల చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టి వర్షాకాలంలో నీటి నిల్వ కొరకు, లీకేజీ లేకుండా ప్రమాదాలను అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.