Wednesday, January 8, 2025

Creating liberating content

తాజా వార్తలుయువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంది

యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంది

-కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది
-విజన్ తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు
-ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరం
-నిత్యం ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు గారే నాకు స్పూర్తి
-కుప్పం డిగ్రీ కాలేజీ విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి

కుప్పం:
పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందని , ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు. విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి :విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను మీలాగే సరదాగా గడిపాను. కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటూ ఉండగా 19 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు గారు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఒక చాలెంజ్ గా తీసుకుని పనిచేశాను. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థానాలకు వెళ్లాలి:ఆటపాటలే కాదు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విజయం ఊరికే ఏమీ రాదు..కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉన్నత స్థానాలకు మనం చేరుకోగలము. విజయానికి షార్ట్ కట్ లేదు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు. నేను నా కుమారుడు లోకేష్ కి కూడా అదే చెప్పేదాన్ని . అన్ని రంగాల్లోనూ మహిళలదే హవా:ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లు. తర్వాత పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఐటీ రంగంలో కూడా మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. మగవారితో సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారు. కుప్పం అభివృద్ధి మా బాధ్యత:చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ప్రజలకు సేవ చేయాలని తపిస్తారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళుతున్నారు. పేదరికం లేని సమాజమే ఆయన లక్ష్యం. చంద్రబాబు గారిని సొంత బిడ్డగా భావిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేము. రాబోయే ఐదేళ్లలో కుప్పం ను అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాను. ఈ సందర్భంగా కుప్పం డిగ్రీ కాలేజీ ఆవరణలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు. అనంతరం కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article